Share News

పద్ధతి ప్రకారం అభివృద్ధి, సంక్షేమం అమలు

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:38 PM

ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీల్లో ఐదు అమలు చేస్తున్నామని, దీంతో ప్రజల కళ్లల్లో అనందం కనబడుతుందన్నారు.

పద్ధతి ప్రకారం అభివృద్ధి, సంక్షేమం అమలు

మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ

ప్రతీ నియోజకవర్గానికి రూ.20కోట్లతో రోడ్లు అభివృద్ధి

రాష్ట్రంలో రూ.1150కోట్లతో నూతనంగా రోడ్లు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

యాదాద్రి, మార్చి6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీల్లో ఐదు అమలు చేస్తున్నామని, దీంతో ప్రజల కళ్లల్లో అనందం కనబడుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని అభివృద్ధి సంక్షేమ కా ర్యక్రమాలను అమలు చేస్తామని, జిల్లాకు చెందిన సాగునీ టి ప్రాజెక్టులపై సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించామన్నారు. బస్వాపూర్‌, గంధమల్ల ప్రాజెక్టులు, సా గునీటి కాల్వల అభివృద్ధికి రూ.200కోట్లతో చర్యలు తీసుకుంటామన్నారు.ప్రతీ నియోజకవర్గానికి రూ.20కోట్లతో రో డ్లు అభివృద్ధి చేయనున్నామని, అన్ని కూడా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒకటో తేదీన వేతనాలు అందించి, పాత రోజు లు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ నుంచి 20 తేదీల్లో ఉద్యోగులకు వేతనాలు అందేవని, దీంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారని తెలిపారు. రాష్ట్రంలో మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ప్రత్యేక టీంగా ఏర్పడి పనిచేస్తున్నామన్నారు. ఈ నెల 11వ తేదీన భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని, ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ప్రధా ని నరేంద్రమోదీని కలిసి రీజినల్‌ రింగ్‌రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరామని, ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందికాకుండా.. ఎవరికి నష్టం కలుగకుండా మార్పులు, చేర్పులు చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.1,150 కోట్లతో పనులు చేపట్టనున్నామని, అర్హులైన వారికి ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయ విధానంతో సేద్యం చేపట్టాలి

రాజాపేట: రైతులు శాస్త్రీయ విధానంతో సేద్యం చేపట్టి అధిక లాభాలు సాధించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. రాజాపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వడగండ్లతో భువనగి రి, ఆలేరు నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా జరిగిందని, పంట బీమా అమలు చేయాలన్నారు. రాజాపేట మండలంలో ప్రతీ ఏటా వడగండ్లతో రైతులు పంటలు నష్టపోతున్నారని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని, రసాయన మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంతో పండించాలని, శాస్త్రీయ విధానాలతో సాగు చేసి అధిక లాభాలను పొందాలన్నారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ వీప్‌ బీర్ల అయిలయ్య, వ్యవసాయ శా ఖ ఏడీఏ పద్మావతి, మండల వ్యవసాయ అధికారి మాధ వి, ఎంపీటీసీ రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:38 PM