Share News

ఐఐహెచ్‌టీని పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:55 PM

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని భూదాన్‌పోచంపల్లిలోనే ఏర్పాటుచేయాలని, ముచ్చింతలకు తరలించవద్దని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఐఐహెచ్‌టీని పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలి

మాజీ ఎమ్మెల్యేలు సునీతామహేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి

యాదాద్రి, సెప్టెంబ రు 10(ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని భూదాన్‌పోచంపల్లిలోనే ఏర్పాటుచేయాలని, ముచ్చింతలకు తరలించవద్దని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం భువనగిరిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాకు కేటాయించిన ఐఐహెచ్‌టీని తరలించడంతో జిల్లావాసులు ఆం దోళన చెందుతున్నారన్నారు. భూదాన్‌పోచంపల్లిలో 26ఎకరాల్లో ఉన్న హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థను నెలకొల్పకుండా, సౌకర్యాలు లేవన్న సాకుతో సంస్థను తరలించడాన్ని ఖండిస్తున్న ట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చేపట్టిన పనులన్నీ నామరూపాలు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిన బూనారని, అందులో భాగంగానే ఐఐటీహెచ్‌ను ముచ్చింతలలో ఏర్పాటు చేసేందకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భూదాన్‌పోచంపల్లి చేనే త వస్త్రాలకు అంత ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందని, ఈ ప్రాంతంలోని యువత వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జిల్లానుంచి కేంద్ర సంస్థను తరలించడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అడ్డుకోవాలని, సీఎం ఒత్తిడికి తలొగ్గ వద్దన్నారు. నాటి చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ ఎంతో ప్రయత్నించి, కేంద్రాన్ని ఒప్పించి ఈ సంస్థను మంజూరు చేయించారని, ప్రభుత్వం దురుద్దేశంతోనే ఐఐహెచ్‌టీని పోచంపల్లిలో ఏర్పాటు చేయడంలేదన్నారు. పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో ఉన్న టెక్స్‌టైల్స్‌ హ్యాండ్లూమ్స్‌లో అన్ని వసతులు ఏర్పాటుచేసి, ఇక్కడే స్థాపించేందుకు మంత్రి, ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు. లేదంటే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు జడల అమరేందర్‌గౌడ్‌, బీరు మల్లయ్య, కిరణ్‌కుమార్‌, జనగాం పాండు, రచ్చ శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:55 PM