Share News

అధికారంలోకి వస్తే సీఏఏ, ఎనఆర్‌సీ రద్దు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:03 AM

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సీఏఏ, ఎనఆర్‌సీ రద్దు చేస్తామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మైనార్టీ కార్పొరేషన వైస్‌చైర్మన ఎండీ జబ్బార్‌ ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌విందుకు హాజరై మాట్లాడారు.

 అధికారంలోకి వస్తే సీఏఏ, ఎనఆర్‌సీ రద్దు
ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, ఏప్రిల్‌ 2 : దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సీఏఏ, ఎనఆర్‌సీ రద్దు చేస్తామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మైనార్టీ కార్పొరేషన వైస్‌చైర్మన ఎండీ జబ్బార్‌ ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌విందుకు హాజరై మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అన్నివర్గాలకు రక్షణ ఉంటుందన్నారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ముస్లింలు అండగా ఉండాలన్నారు. కోదాడలో ముస్లింల షాదీఖానాకు రూ.3 కోట్లు, ఈద్గా అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మునిసిపల్‌ చైర్‌పర్సన సామినేని ప్రమీలరమేష్‌, వంగవీటి రామారావు, బషీర్‌, అల్తాఫ్‌ హుస్సేన, బాగ్దాద్‌, ఎజాజ్‌, బాషుమియా, పారా సీతయ్య, పాలూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:03 AM