Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వందేళ్ల సేవలు అభినందనీయం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:58 AM

ఆర్య సమాజ మందిరం వందేళ్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలోని ఆర్యసమాజ మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహార్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి ఉత్సవాలు, ఆర్యసమాజ మందిర వందేళ్ల పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వందేళ్ల సేవలు అభినందనీయం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ముగిసిన ఆర్య సమాజం వందేళ్ల వేడుకలు

నల్లగొండ కల్చరల్‌, మార్చి 3: ఆర్య సమాజ మందిరం వందేళ్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలోని ఆర్యసమాజ మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహార్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి ఉత్సవాలు, ఆర్యసమాజ మందిర వందేళ్ల పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దయానంద సరస్వతి సమాజానికి అందించి ధర్మసూత్రాలను ఆచరించాలన్నారు. వంద సంవత్సరాల నుంచి ఆర్యసమాజ్‌ సేవా కార్యక్రమాలు నిర్వహి స్తూ దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆర్య సమాజ మందిరానికి కావాల్సిన వసతులు, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా గోషాలకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉత్సవాల్లో మూడో రోజు కూడా గురుకులాల ఆచార్యులు, విద్యార్థినీ, విద్యార్థులు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ యజ్ఞాన్ని నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ యజ్ఞం సాగగా, కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, స్వా మి ప్రణవానంద సరస్వతి, స్వామి ఆర్యవేశ్‌ పాల్గొన్నారు. అనంతరం మంత్రిని ఆర్య సమాజ మంది రం నిర్వాకులు ఘనంగా సత్కరించారు. అదేవిధం గా మూడు రోజు పాటు నిర్వహించిన ఉత్సవాలకు హాజరైన ప్రతినిధులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రావు, జిల్లా అఽధ్యక్షుడు బోయపల్లి కృష్ణారెడ్డి, కార్యదర్శి జె.గోపాల్‌రెడ్డి, ఉపకార్యదర్శి యర్లమల్ల లక్ష్మినరసింహ, కంది సూర్యనారాయణ, నాగులపల్లి శ్యాంసుందర్‌, కంది మట్టపల్లి, కె.శంకర్‌, రవీ ప్రసా ద్‌, నల్లగొండ పండితులు శక్తి నందన్‌, కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

నల్లగొండ టౌన్‌: ఐదేళ్ల లోపు పిల్లలు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్క అర్బన్‌ పైమ్రరీహె ల్త్‌ సెంటర్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సుమారు 1,61,925 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్క లు వేసేందుకు అధికారులు 981 కేంద్రాల ను ఏర్పాటు చేసి, 3,924మంది ఉద్యోగుల ను కేటాయించారన్నారు. అంతకుముందు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో చిన్నారులకు మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌ హరిచందన, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండల్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జమీర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిత్యానంద, ఎంసీహెచ్‌ పీవో అరుంధతిరెడ్డిపాల్గొన్నారు.

హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్‌ బిల్లులపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బైక్‌పై ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మాన్యంచెల్క, హైదర్‌ఖాన్‌గూడా, రహమత్‌నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి గృహజ్యోతి విద్యుత్‌ వినియోగదారులతో మాట్లాడారు. గృహజ్యోతి కింద జిల్లాలో 1.82లక్షల మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు. మామిళ్లగూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో మాన్యంచెల్కలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమం లో ఆర్డీవో రవి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ చంద్రమోహన్‌, డీఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేస్తాం

తిప్పర్తి, కనగల్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని రెండేళ్లలో పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం తిప్పర్తి మండల పరిధిలోని మర్రిగూడెం, కనగల్‌ మండల కేంద్రంలో విద్యుత్‌ జీరో బిల్లు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ నా గులవంచ విజయలక్ష్మీ, తహసీల్దార్‌ డి.స్వప్న, విద్యుత్‌శాఖ డీఈ నాగయ్య, ఏఈ రమ్య, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, ముత్తినేని శ్యాంసుందర్‌, పార్టీ మండల అధ్యక్షుడు జూకూరి రమేష్‌, యూత్‌ అధ్యక్షుడు బద్ధం సుధీర్‌, జాకటి మోష, రొట్టెల రమేష్‌, నాగరాజు, నలపరాజు శ్రీనివాస్‌, ఎండీ బాబర్‌, ఆదిమూళ్ళ ప్రశాంత్‌, ఎద్దు ఉపేందర్‌, మం దడి రామచంద్రారెడ్డి, గడ్డం అనూ్‌పరెడ్డి, నర్సింగ్‌ శ్రీనివా్‌సగౌడ్‌, అంజిరెడ్డి, భారతివెంకటేశం, హఫీజుద్దీన్‌, కె.అంజిరెడ్డి, గోలి జగాల్‌రెడ్డి, రాజారెడ్డి, డి.వెంకట్‌రెడ్డి, నర్సింగ్‌ మురళిగౌడ్‌, లక్ష్మయ్యగౌడ్‌పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:58 AM