Share News

బీబీనగర్‌లో భారీ వర్షం

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:59 PM

జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. బీబీనగర్‌ మండల కేంద్రంలో భారీగా, వలిగొండలో మోస్తరు వర్షం పడింది.

బీబీనగర్‌లో భారీ వర్షం
బీబీనగర్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిలిచిన వర్షపు నీరు

బీబీనగర్‌, వలిగొండ, జూన 11 : జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. బీబీనగర్‌ మండల కేంద్రంలో భారీగా, వలిగొండలో మోస్తరు వర్షం పడింది. బీబీనగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వేఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై కురిసిన నీరంతా దిగువనున్న పీహెచసీ రహదారి బంగ్లా, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోకి చేరింది. దీంతో మండల పరిషత కార్యాలయ ఆవరణలో రెండు అడుగుల మేర నీళ్లు చేరాయి. దీంతో కార్యాలయ సిబ్బంది ఇబ్బందులుపడ్డారు. అలాగే గోకుల్‌నగర్‌, ఎంప్లాయిస్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. బైపాస్‌ రోడ్డులోని అండర్‌ ప్రాసింగ్‌, ఆర్వో బ్రిడ్జి టర్నింగ్‌ వద్ద మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. అదేవిధంగా వలిగొండ మండలకేంద్రంలో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 11:59 PM