Share News

హరితహారం లక్ష్యాన్ని సాధించాలి

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:31 AM

హరితహారంలో మొక్కలు నాటేందు కు వివిధ శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాన్ని సకాలంలో సాధించాలని అదనపు కలెక్టరు(రెవెన్యూ) బెన్‌ షాలోమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశ మై హరితహారం లక్ష్యాన్ని నిర్ధేశించి మాట్లాడారు.

హరితహారం లక్ష్యాన్ని సాధించాలి

అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌

భువనగిరి అర్బన్‌, మార్చి 15: హరితహారంలో మొక్కలు నాటేందు కు వివిధ శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాన్ని సకాలంలో సాధించాలని అదనపు కలెక్టరు(రెవెన్యూ) బెన్‌ షాలోమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశ మై హరితహారం లక్ష్యాన్ని నిర్ధేశించి మాట్లాడారు. వ చ్చే జూన్‌, జూలై నెలల్లో వర్షాలకనుగుణంగా మొక్క లు నాటాలని, శాఖలవారీ లక్ష్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో అటవీ అధికారి పద్మజారాణి, డీఆర్డీవో ఎం.ఎ.కృష్ణన్‌, జడ్పీ సీఈవో శోభారాణి, వ్యయసాయ అధికారి అనురాధ, పంచాయితీ అధికారి సునంద, ఉద్యానవన అధికారి అన్నపూర్ణ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌గా బెన్‌షాలోమ్‌ బాధ్యత స్వీకరణ

అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)గా బెన్‌ షాలోమ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హుస్నాబాద్‌ ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఆయన ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ ఆదేశాలతో పదోన్నతిపై ఇక్కడ విధుల్లో చేరారు.

Updated Date - Mar 16 , 2024 | 12:31 AM