Share News

కలెక్టర్‌గా హరిచందన బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:50 AM

జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు పలు శాఖల అధికారు లు సాదర స్వాగతం పలికారు. తన ఛాంబర్‌కు చేరుకున్న కలెక్టర్‌ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

కలెక్టర్‌గా హరిచందన బాధ్యతల స్వీకరణ

స్వాగతం పలికిన ఎస్పీ, అదనపు కలెక్టర్‌

నల్లగొండ, జనవరి 8: జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు పలు శాఖల అధికారు లు సాదర స్వాగతం పలికారు. తన ఛాంబర్‌కు చేరుకున్న కలెక్టర్‌ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌ను ఎస్పీ చందనా దీప్తి, ఇన్‌చార్జి కలెక్టర్‌ హే మంత్‌ కేశవ్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలు శాఖల అఽధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టరే ట్‌ సిబ్బంది నూతన కలెక్టర్‌కు పూల బోకేలు అందజేశారు.

12లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయాలి

రామగిరి: ప్రజాపాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులన్నీ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌ చేయాలని కలెక్టర్‌ దాసరి హరిచందన ఆదేశించారు. సోమవారం బాధ్యతలు తీసుకున్న అనంతరం మునిసిపల్‌ కమిషనర్‌ కందుకూరి వెంకటేశ్వర్లుతో కలిసి మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను ఆమె తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఇప్పటివరకు ఎన్ని ఆన్‌లైన్‌ చేశారని అడిగి తెలుసుకున్నారు. దీంతో కమిషనర్‌ మాట్లాడుతూ, పట్టణంలో 48 వార్డులకు 47,098 దరఖాస్తులు వచ్చాయని, అందులో 20శాతం ఆన్‌లైన్‌ చేశామని వివరించారు. 14వ తేదీన సంక్రాంతి పండుగ ఉన్నందున 12వ తేదీలోగా దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌ చేయాలని లేదంటే పండుగ కూడా ఇక్కడే చేయాల్సి ఉంటుందని సిబ్బందితో అన్నారు. ఆమె వెంట మునిసిపల్‌ డీఈ వెంకన్న, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:50 AM