హర హర శంకర.. జయ జయ శంకర
ABN , Publish Date - Mar 09 , 2024 | 01:21 AM
హరహర మహదేవ.. శంభో శంకర.. అంటూ భక్తుల శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగాయి. భక్తులు శుక్రవారం తెల్లవారుజా ము నుంచే ఆలయాలకు చేరుకుని పార్వతీ పరమేశ్వరుల ను దర్శించుకుని అభిషేకాలు, రుద్రాభిషేకం, లింగాభిషేకా లు, కుంకుమార్చనలు, రుద్ర హోమాలు నిర్వహించారు.
శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు
జాగరణ, ఉపవాస దీక్షలో భక్తులు
ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి కోమటి వెంకట్‌రెడ్డి, జిల్లా జడ్డి నాగరాజు
నల్లగొండ కల్చరల్, మార్చి 8 : హరహర మహదేవ.. శంభో శంకర.. అంటూ భక్తుల శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగాయి. భక్తులు శుక్రవారం తెల్లవారుజా ము నుంచే ఆలయాలకు చేరుకుని పార్వతీ పరమేశ్వరుల ను దర్శించుకుని అభిషేకాలు, రుద్రాభిషేకం, లింగాభిషేకా లు, కుంకుమార్చనలు, రుద్ర హోమాలు నిర్వహించారు. జిల్లా కేంద్ర సమీపంలోని పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో భక్తు లు శివ పార్వతులకు అభిషేకాలు, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు నవీన్‌శర్మ ఆఽధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి.
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ని ప్రసిద్ద శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, నార్కట్‌పల్లి రామలింగేశ్వర స్వా మి ఆలయాల్లో రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రత్యేక పూజల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పాల్గొన్నారు.
దామరచర్ల: మండలంలోని శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర, శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకున్నారు. కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం లో నీళ్లు అడుగంటడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ఆలయ సమీపంలోని షవర్స్‌ను ఏర్పాటు చేశారు. శ్రీ మీనా క్షి అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పూజలు నిర్వహించారు. పురాతన త్రిలింగేశ్వరాలయం లో పెద్ద ఎత్తున స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 6వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
మేళ్లచెర్వు: మహాశివరాత్రి సందర్భంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భావకాల, మహాన్యాస పూర్వక, రుద్రాభిషేకాలు నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిషేకాలు ప్రారంభించాల్సి ఉండగా, డిల్లీ పర్యటనలో ఉండటంతో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మహాజాతరను ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, విష్ణువర్థన్‌శర్మ, ధనుంజయశర్మలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం నిర్వహించారు.
నేరేడుచర్ల: ప్రాచీన సోమప్ప దేవాలయంలో ఉదయం 3గంటల నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. ట్రాఫిక్‌కు ఎ టువంటి అంతరాయం కలుగకుండా పోలీసులు ప్రత్యేక చ ర్యలు తీసుకున్నారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో దాతలు తా గునీటి సరఫరా చేశారు.బారులుతీరి దర్శనం చేసుకున్నారు.
సూర్యాపేటరూరల్: పిల్లలమర్రి శివాలయాల్లో ఉదయం 4గంటల నుంచి మహన్యాస పూర్వక పూర్వక రుద్రాభిషేకం, ఎర్రకేశ్వరాలయం, త్రికూటేశ్వరం ఆలయాల్లో మద్యాహ్నం 1-30 గంటలకు భక్తులు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణ బసవముద్ద, రాత్రి 12-30 గంటలకు లింగోద్భవ కాలంలో దేవతామూర్తుల కళ్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు.
భువనగిరి టౌన్: భువనగిరిలోని శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయం, దక్షిణేశ్వరాలయం, శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయంతో పాటు పట్టణంలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. శివపార్వతుల కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అర్థరాత్రి వరకు ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
బీబీనగర్: మహాదేవ్‌పూర్ గ్రామంలోని అక్కన్న మాదన్న ఆలయంలో కొలువైన ఉమామహేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సతీసమేత శ్రీ వేణుగోపాల స్వామి, చిన్న రావులపల్లిలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాల స్వామి మండపంలో ఉత్సవాల తొలిరోజు అష్టోత్తర కలశాభిషేకం, ధ్వజారోహణం, హోమం కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. చిన్న రావులపల్లిలోని రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు.