Share News

ఇచ్చేదే సగం.. నెలలుగా పెండింగ్‌

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:56 AM

చాలీచాలని వేతనాల తో నెట్టుకొస్తున్న ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (ఎఫ్‌టీఎస్‌)కు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులుగా పరిగణించే ధరణి ఆపరేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొదట్లో నెలనెలా వేతనాలు చెల్లించి రానురానూ రెండు మూడు నెలలకోసారి ఇస్తూ వచ్చారు.

ఇచ్చేదే సగం.. నెలలుగా పెండింగ్‌

9 నెలలుగా వేతనాలులేక ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఆందోళన

మిర్యాలగూడ, జనవరి7: చాలీచాలని వేతనాల తో నెట్టుకొస్తున్న ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (ఎఫ్‌టీఎస్‌)కు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులుగా పరిగణించే ధరణి ఆపరేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొదట్లో నెలనెలా వేతనాలు చెల్లించి రానురానూ రెండు మూడు నెలలకోసారి ఇస్తూ వచ్చారు. వచ్చేదే సగం, మిగతా సగం కంపెనీలే తీసుకుంటుండగా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గత వారం ఫీల్డ్‌ టెక్నిక్‌ స్టాఫ్‌ కలెక్టర్లకు వినతిపత్రం అందజేయడంతోపాటు ఆదివారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దేశ్యానాయక్‌ను కలిసి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని విన్నవించారు.

రికార్డుల నిర్వహణ కోసం

రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ నిర్వహణకు 2018 మే 23న రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒకరిని చొప్పు న 584 మంది ఎఫ్‌టీఎస్‌, వారికి తోడుగా 31 జిల్లాల్లో జిల్లా కోఆర్డినేటర్లతో కలిపి 713 మందిని నియమించేందుకు ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐఎల్‌అండ్‌ఎ్‌ఫఎస్‌) అనే కంపెనీ (ప్రస్తుతం టెరాసి్‌స)కు అవకాశం కల్పించింది. ఈ కంపెనీ సైట్‌ నిర్వహణతోపాటు వెబ్‌ డిజైనింగ్‌ పనులను నిర్వహి స్తూ ఉద్యోగుల నియామక బాధ్యతలను ఈసెంట్రిక్‌ (ప్రస్తుతం పారాడిగమ్‌ ఐటీ)అనే మరో కంపెనీకి అప్పగించింది. ఎఫ్‌టీఎ్‌సలకు నెలకు రూ.11వేల చొప్పున ప్రభుత్వం వేతనం చెల్లిస్తోంది.

వేతనం తక్కువ.. పని ఎక్కువ

వెబ్‌ల్యాండ్‌ స్థానంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి సైట్‌ను తీసుకొచ్చింది. మండలాల వారీగా రైతులకు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సేవలందించేందుకు ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులకు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఉదయం 9గంటలకు మండల కార్యాలయంలోకి ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగి అడుగు పెడి తే బయటకొచ్చేదెప్పుడో తెలియని పరిస్థితి నెలకొం ది. ఒక్కోసారి రాత్రి 10గంటల వరకు విధులు నిర్వహించాల్సి వచ్చింది. సర్వే నెంబర్ల వారీగా రైతుల వేలిముద్రల సేకరణ, సైట్‌లో వివరాలు పొందుపర్చడం వంటి పనులలో ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులు తీరిక లేకుండా విధులు నిర్వహించారు. భూ ముల రిజిస్ట్రేషన్‌ విఽధులను ప్రభుత్వం తహసీల్దార్లకు బదిలీ చేయడంతో వీరిపై మరింత పనిభా రం, ఒత్తిడి కూడా పెరిగింది. రోజుకు 12గంటలకు పైగా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నా రూ.11,000 వేతనం మాత్రమే అందుతోంది. జీవో 63, 2021 ప్రకారం వేతనాలను రూ.31,000కు పెం చాలని డిమాండ్‌ చేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని వారి వాపోతున్నారు. నల్లగొండ జిల్లా లో 36 మంది, సూర్యాపేట జిల్లాలో 26మంది, యాదాద్రి జిల్లాలో 19మంది, మొత్తం ఉమ్ముడి నల్లగొండ జిల్లాలో 81 మంది ధరణి ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కంపెనీలు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది.

వేతనంలో సగం కోత

ఒక్కో ఎఫ్‌టీఎస్‌కు ప్రభుత్వం 2021 జూన్‌ వరకు ఐఎల్‌అండ్‌ఎ్‌ఫఎస్‌ కంపెనీ ద్వారా రూ. 18, 000చెల్లించగా, అదే ఏడాది జూలై నుంచి టెరాసిస్‌ కంపెనీ ద్వారా రూ.24,000 చెల్లిస్తుండ గా, ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి నెలకు రూ.5 వేల చొప్పున టెరాసిస్‌ కంపెనీ కోత విధిస్తోంది. మిగిలిన రూ.19,000 పారాడిగమ్‌ఐటీ కంపెనీ రూ. 3,000 కోత పెడుతోంది. మిగతా రూ.16,000 లలో పీఎఫ్‌, ఈఎ్‌సఐ పోగా నికరంగా ఒక్కో ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగికి రూ.11,000 వేతనంగా అందుతోంది. కాగా వీటిని తొమ్మిది నెలలుగా సదరు కంపెనీలు చెల్లించకపోవడంతో ఎఫ్‌టీఎస్‌ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వేతనాల కోసం ఎవరిని అడగాలో తెలియక రాష్ట్రంలోని 713 మంది ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:56 AM