Share News

గ్రూప్‌-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - May 19 , 2024 | 12:19 AM

వచ్చే నెల 9న గ్రూప్‌-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎం.మహేందర్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించా రు. కలెక్టరేట్‌లో శనివారం హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

గ్రూప్‌-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

భువనగిరి అర్బన్‌, మే 18: వచ్చే నెల 9న గ్రూప్‌-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎం.మహేందర్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించా రు. కలెక్టరేట్‌లో శనివారం హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకం గా పరీక్ష నిర్వహణకు అన్ని చేపట్టాలన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రతీ జిల్లాకు ఒక రీజినల్‌ కో ఆర్డినేటర్‌ను నియమించినట్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ జాయింట్‌ కస్టోడియన్‌గా ఉంటారని, వీరికి పోలీస్‌ నోడల్‌ అధికారి సహకరిస్తారన్నారు. ప్రతీ కేంద్రానికి ఒక డీవో (డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌)ను నియమించాలని, తహసీల్దారు స్థాయి అధికారిని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌గా ప్రతీ వంద మంది అభ్యర్థుల కు ఒక ఐడెంటిఫికేషన్‌ అధికారి, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, గాడ్జెట్స్‌, సెల్‌ఫోన్లు వెంట తీసుకెళ్లకుండా తనిఖీ చేపట్టాలన్నా రు. పరీక్ష రోజున విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, నిబంధనల మేరకు పోలీస్‌ బందోబస్తు, 144 సెక్షన్‌ అ మలు చేయాలన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల సమీపం లో జీరాక్స్‌కేంద్రాలను మూసివేయించాలని, ఇతర ప్రాంతాల నుంచి కేంద్రాలకు తరలివచ్చే అభ్యర్థులకోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, పరీక్షకు రెండు రోజుల ముందే కేంద్రాల్లో పరిశుభ్రంగా పారిశుధ్య పనులు నిర్వహించడంతోపాటు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూం కోసం పటిష్ట భద్రతతోపాటు రవాణా ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, కేంద్రం పరిశీలకులు, డీవో, పోలీస్‌ నోడల్‌ అధికారులకు ఈ నెల 22న హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలోని యూజీసీ ఆడిటోరియంలో బయోమెట్రిక్‌ విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్‌ నేపథ్యంలో అభ్యర్థులు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు కేంద్రంలోకి అనుమతి ఉండగా ఆ తర్వాత నిమిషం నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనుండగా హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డుతోపాటు ఫొటో గుర్తింపు కార్డు తేవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 12:19 AM