Share News

నేడు గ్రూప్‌-1 పరీక్ష

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:01 AM

జిల్లాలో ఆదివారం గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు అధికారు లు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

నేడు గ్రూప్‌-1 పరీక్ష

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

భువనగిరి అర్బన్‌, భువనగిరి రూరల్‌, జూన్‌ 8: జిల్లాలో ఆదివారం గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు అధికారు లు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో మథర్‌ థెరిస్సా, మాంటెస్సోరీ, దివ్యబాల హై స్కూల్‌, వెన్నెల ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, క్రిష్ణవేణి ట్యాలెంట్‌ స్కూల్‌, భువనగిరి కాలేజీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స కాలేజీ, జాగృతి, నవభారత్‌ డిగ్రీ, పీజీ కశాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే శనివారం పరిశీలించారు. మొత్తం తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో 3,349మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 నుంచి 10గంటల వరకు మాత్రమే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. తర్వాత నిమి షం ఆలస్యమైనా లోనికి అనుమతించరు. అభ్యర్థులు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ఇబ్బందులు ఎదురైతే 8331997006, 8331997037 సెల్‌ ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒక గుర్తింపు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్‌ టికెట్‌పై ఫొటో సరిగా లేకపోతే గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించాలి. మొత్తం కేంద్రాలను రెండు రూట్లలో విభజించి 10మంది పరిశీలకులు, 9మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 39మంది ఐడెంటిఫికేషన్‌ అధికారులను నియమించారు. డీసీపీ రాజే్‌షచంద్ర నేతృత్వంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు సెల్‌ఫోన్‌కు అనుమతి ఇస్తారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు ప్రతీ పరీక్ష కేంద్రాన్ని మూడు సార్లు పరిశీలిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ఇవ్వాలి. లేదంటే జవాబు పత్రం మూల్యాంకనం చేయరు. అభ్యర్థులు ఎలాంటి ఎలాకా్ట్రనిక్‌ వస్తువులను, సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లకూడదు. మహిళలు మెహందీ, బంగారు ఆభరణాలు ధరించకూడదు. కాళ్లకు షూ, సాక్స్‌ ధరించకూడదు. పరీక్ష సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా జరగేలా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పరీక్షకు సమయానికి వచ్చేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్‌, మెడికల్‌ సదుపాయాలతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం స్రైబ్స్‌, కుర్చీలు, బెంచీలు, ర్యాంపులు తదితర వసతులు కల్పించారు.

Updated Date - Jun 09 , 2024 | 12:01 AM