యాదాద్రి మెడికల్ కళాశాలకు గ్రీనసిగ్నల్
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:45 PM
ఎట్టకేలకు యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన(ఎనఎంసీ) క్లియరెన్స ఇచ్చింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి 50 సీట్లతో ప్రారంభానికి హెచఎంఎ్‌ఫడబ్ల్యూ ఉత్తర్వులు
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
భువనగిరి టౌన, సెప్టెంబరు 10: ఎట్టకేలకు యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన(ఎనఎంసీ) క్లియరెన్స ఇచ్చింది. దీంతో కొన్ని నెలలుగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భువనగిరిలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు ఎనఎంసీ ఇచ్చిన లెటర్ ఆఫ్ పర్మిషన(ఎల్‌వోపీ) మేరకు వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబసంక్షేమ శాఖ(హెచఎంఎ్‌ఫడబ్య్లూ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 50 సీట్లతో కళాశాల ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణ శివారు పగిడిపల్లిలోని పాతకలెక్టరేట్ భవనంలో వైద్యకళాశాల, హాస్టల్ ఏర్పాటు కానుండగా భువనగిరిలోని ప్రస్తుత జిల్లా కేంద్ర ఆసుపత్రి ఇక నుంచి వైద్య కళాశాల బోధనాసుపత్రిగా కొనసాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాల, బోధనాసుపత్రి ప్యాట్రన మేరకు బదిలీలు, నూతన నియామకాల ద్వారా అన్ని స్థాయిల్లో మెజార్టీ పోస్టులను భర్తీ చేయగా మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం వైద్య సీట్లు పెరుగనున్నాయి. భువనగిరిలో వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా విద్యార్థులకు ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. అలాగే బోధనాసుపత్రితో వైద్యసేవలు పెరిగి రోగులకు ఉచిత నాణ్యమైన చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పరంగా ఉపశమనం లభించనుంది. ఎనఎంసీ ఇచ్చిన ఎల్‌వోపీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చిన అనంతరం ప్రక్రియ పూర్తయి వైద్యకళాశాల ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఈ పాటికే అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం.
ఊరించిన ఎనఎంసీ అనుమతులు
వైద్యకళాశాల ఏర్పాటులో ఎనఎంసీ అనుమతులు ముఖ్యమైనవి వైద్య కళాశాల, బోధనాసుపత్రిలో ఉన్న వసతులు, ఔట్ పేషంట్, ఇన పేషంట్ విభాగాలు, ప్రొఫెసర్స్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్, రెసిడెంట్ డాక్టర్స్, నర్సింగ్ తదితర పోస్టుల భర్తీ తదితర అంశాలపై సమగ్ర పరిశీలన జరిపాకే ఎనఎంసీ అనుమతులు ఇస్తుంది. ఈ మేరకు భువనగిరిలో ప్రతిపాదించిన వైద్యకళాశాల కోసం జూన 23నుంచి ఎనఎంసీ బృందాలు ప్రత్యక్ష్యంగా, ఆనలైనలో పలు దఫాలుగా పరిశీలన జరిపారు. అదే సమయంలో కళాశాల ఏర్పాటుకు అనుమతులు సాధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు కొన్నేళ్ల పాటు రాష్ట్ర వైద్య, విద్య శాఖ డైరెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్ రమే్‌షరెడ్డిని కళాశాల ప్రిన్సిపల్‌గా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన డాక్టర్ రాజారావును జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. వారి అనుభవాల మేరకు ఎనఎంసీ బృందాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందివ్వడం, లోపాలను సవరించడం, కలెక్టర్ హనుమంతు కే జెండగే పాలనాపరమైన సహకారం అందించారు. అదేవిధంగా ఇటీవలి వరకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి ప్రస్తుతం డీసీహెచఎ్‌సగా కొనసాగుతున్న డాక్టర్ చిన్నానాయక్ సకాలంలో అవసరమైన సమాచారాన్ని అందించారు. వీరికి తోడుగా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగా వైద్య కళాశాల ఏర్పాటుపై జిల్లా ప్రజల కల నెరవేరుతున్నదని పలువురు అంటున్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు ఎనఎంసీ ఎల్‌వోపీ ఇవ్వడం, హెచఎంఎ్‌ఫడబ్ల్యూ ఉత్తర్వులు జారీ చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.