Share News

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - May 20 , 2024 | 12:26 AM

మండలంలో నిలిచిన ధా న్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌ అనితారామచంద్రన్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం పోచంప ల్లి, రేవణపల్లిలోని పీఎసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ హనుమంతు కే.జెండగేతో కలిసి తనిఖీ చేశారు.

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి

గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌ అనితారామచంద్రన్‌

భూదాన్‌పోంచపల్లి, మే 19: మండలంలో నిలిచిన ధా న్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌ అనితారామచంద్రన్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం పోచంప ల్లి, రేవణపల్లిలోని పీఎసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ హనుమంతు కే.జెండగేతో కలిసి తనిఖీ చేశారు. కొనుగోళ్ల వివరాలను, ఇబ్బందులను అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లారీల జాప్యంతో ధాన్యం కొనుగోళ్లలో వేగం మందగించిందని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా జిల్లా అధికారులతో మాట్లాడతానని అన్నారు. రైస్‌ మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాల కారణంగా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే జిల్లాల్లో ఏ రైస్‌ మిల్లులు ఖాళీగా ఉంటే అక్కడ దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అదనపు కలెక్టర్‌ బెన్‌షోలోమ్‌, జిల్లా అధికారులు, స్థానిక తహసీల్దార్‌తో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ గోపికృష్ణ, జిల్లా అధికారి శ్రీనివా్‌సరెడ్డి, మార్కెటింగ్‌ జిల్లా అధికారి సబిత, జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, తహసీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:26 AM