Share News

ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:40 PM

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ సారి ఉమ్మడి జిల్లాలో యాదాద్రి జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో 3,37,3676 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఆ తరువాత స్థానంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి.

ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ఉమ్మడి జిల్లాలో 8.88లక్షల మెట్రిక్‌టన్నుల సేకరణ

అత్యధికంగా యాదాద్రి జిల్లాలో రికార్డు స్థాయిలో 3.37లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు రూ.1,788కోట్లు రైతులకు చెల్లింపు

పెండింగ్‌లో రూ.150కోట్లు

త్వరలో విడుదలయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ సారి ఉమ్మడి జిల్లాలో యాదాద్రి జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో 3,37,3676 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఆ తరువాత స్థానంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభం కాకముందే జూన్‌ మొదటివారంలోనే ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేగాక వానాకాలం సీజన్‌ వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

ఉమ్మడి జిల్లాలో కోతుల బెడద అధికంగా ఉండటంతో యాసంగిలో ఆరుతడి పంటల రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతారు. వ్యవసాయ, బోరుబావుల ఆధారంగా ఈ ఏడాది అధికంగా వరి సాగైంది. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం సేకరణకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 987 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, యాదాద్రి జిల్లా లో 323, సూర్యాపేట జిల్లాలో 294 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల ద్వారా మొత్తం 8,88,148మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికా ర యంత్రాంగం సేకరించింది.

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ గత నెల మూ డో వారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 370 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి మొదటి వారం తరువాత ధా న్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటి వరకు మొత్తం రూ.644 కోట్ల మేర రైతుల ఖాతాల్లో నగదు జమైంది. జిల్లాలో 5లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యం లక్ష్యానికి 3,10,250మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మిగతా ధాన్యాన్ని రైతులు మిల్లర్లకు విక్రయించినట్లు సమాచారం. కాగా, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.668కోట్లకు రూ.644 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.24కోట్లు చెల్లించాల్సి ఉంది.

సూర్యాపేట జిల్లాలో మొత్తం 294ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటుచేయగా, రూ.529.89కోట్ల విలువైన 2,40,531 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కాగా, రైతులకు ఇప్పటి వర కు రూ.524.49కోట్లు చెల్లించారు. ఇంకా రూ.5.40కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం 83,125మంది రైతుల ధాన్యం కొనుగోలు చేయగా, 42,954 మందికి చెల్లింపులుచేశారు. ఇంకా 40,171 మందికి నగదు చెల్లింపు చేయాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో 987 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.1,938.9కోట్ల విలువైన 8,88,148మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రైతుకు రూ.1,788.55 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.150.35కోట్లు చెల్లించాల్సి ఉంది.

‘ఆన్‌లైన్‌’తో చెల్లింపులు సులువుగా

ధాన్యం విక్రయించిన మిగతా రైతులకు కూడా త్వరలోనే నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండేందుకు రైతుల వివరాలను ‘ఆన్‌లైన్‌’లో పొందుపరిచారు. ఏ మండలాల్లో ఎంతమంది రైతులు ఉన్నారన్న సమాచారం తో పాటు, రైతుల భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు సహా సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవరెన్స్‌ (సీజీజీ) సహకారంతో ఆన్‌లైన్‌లో నిక్షి ప్తం చేశారు. రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటు లో ఉంచారు. ధాన్యం విక్రయించే రైతుల నుంచి ఆధార్‌కార్డు, బ్యాం కు ఖాతా నెంబర్‌ సేకరించారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల కు పట్టా పాస్‌పుస్తకాల జీరాక్స్‌ కాపీలను తీసుకెళ్లాల్సిన పని తప్పిం ది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పౌరసరఫరాలశాఖ ట్యాబ్‌తో పాటు ప్రింటర్లను కూడా పంపిణీ చేసింది. రైతుల వద్ద ధాన్యం సే కరించగానే రోజువారీగా ఎంతమేరకు కొనుగోలు చేశారనే వివరాల ను ట్యాబ్‌లలో నమోదు చేశారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు పంపిన వివరాలను పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ పరిశీలించి, అన్నిసరిగ్గా ఉన్న పక్షంలో ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సంతకంతో ఆమోదించగా నే నేరుగా రైతుల బ్యాంకుఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమయ్యాయి.

రూ.1,938.9కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు

ఉమ్మడి జిల్లాలో యాసంగిలో రూ.1,938.9కోట్ల విలువైన 8,88, 148 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.యాదాద్రి జిల్లా లో యాసంగిలో 2.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, 5లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని, కొనుగోలు కేంద్రాలకు 4.11లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని వ్య వసాయశాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలుకేంద్రాల ద్వారా 3,37,367 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.ఇప్పటివరకు 3,37,445 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మి ల్లులకు ఎగుమతిచేశారు. ఇంకా 231.360మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉంది. మొత్తం 35,865 మంది రైతుల వద్ద రూ.741.01కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రూ.620.06కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు చేశారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తి : గోపికృష్ణ, యాదాద్రి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

యాసంగిలో ధాన్యం కొనుగోలుకు 323 కేంద్రాలను ఏర్పాటుచేశాం. ఈసారి ముందస్తుగానే కొనుగోళ్లు పూర్తి చేశాం. ఇప్పటివరకు జిల్లాలో 3.37లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని, 35,865 మంది రైతుల నుంచి సేకరిం చాం. రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.741కోట్లకు రూ.620. 06కోట్ల మేరకు చెల్లించాం. మిగతా రైతుల డబ్బును కూడా త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. ఈ సారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి జిల్లా అత్యధికంగా ధాన్యాన్ని సేకరించడంతోపాటు, జూన్‌ మొదటి వారంలోపే కొనుగోళ్లను పూర్తి చేశాం.

Updated Date - Jun 07 , 2024 | 11:40 PM