Share News

మహిళలను అణచివేస్తున్న ప్రభుత్వాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:40 AM

కులం, మతం పేరిట ప్రభుత్వాలు మహిళలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టుపల్లి అనురాధ అన్నారు.

మహిళలను అణచివేస్తున్న ప్రభుత్వాలు
ప్రచారం నిర్వహిస్తున్న ఐద్వా నాయకులు

భువనగిరి టౌన, జనవరి 8: కులం, మతం పేరిట ప్రభుత్వాలు మహిళలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టుపల్లి అనురాధ అన్నారు. సోమవారం భువనగిరిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హర్షనీయమని అన్నారు. అన్ని మార్గాల్లో బస్సు సౌకర్య లేకపోడంతో మారుమూల ప్రాంతాల మహిళలకు ఉచిత సేవలు అందడం లేదన్నారు. చటల్ట సభల్లో 33శాతం మహిళల వాటాను సాధించేందుకు సంయుక్త ఉద్యమాలు అవసరమని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేస్తున్న ఘనత ఐద్వాదే అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కల్లూరి నాగమణి, మందడి మంజుల, మాధవి, కరుణ, హారిక, పద్మ, పుష్పలత, లక్ష్మీ, ధనమ్మ, అంజలి, సునీత పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:40 AM