Share News

జిల్లాలోనే ప్రభుత్వ వైద్య కళాశాల

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:57 PM

జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాల తరలింపు వదంతులకు తెరపడింది. 2023, జూలై 6వ తేదీన జిల్లాకు అప్పటి ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరుచేయ గా సాంకేతిక కారణాలతో కళాశాల ఏర్పాటులో ఆలస్యమైంది.

జిల్లాలోనే ప్రభుత్వ వైద్య కళాశాల

తరలింపు వదంతులకు చెక్‌ పెట్టిన ప్రభుత్వం

భువనగిరిలోని పాత కలెక్టరేట్‌లో తాత్కాలికంగా ఏర్పాటు

ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ మల్లిఖార్జున్‌ నియామకం

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 15: జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాల తరలింపు వదంతులకు తెరపడింది. 2023, జూలై 6వ తేదీన జిల్లాకు అప్పటి ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరుచేయ గా సాంకేతిక కారణాలతో కళాశాల ఏర్పాటులో ఆలస్యమైంది. దీంతో జిల్లాకు మంజూరైన వైద్యకళాశాలను ప్రస్తుత ప్రభుత్వం మరో ప్రాం తానికి తరలిస్తోందన్న వదంతులతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. కాని ఆ వదంతుల్ని కొట్టిపారేస్తూ యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాల్సిన వైద్యకళాశాలను తాత్కాలికంగా జిల్లాకేంద్రం భువనగిరి పట్టణంలో ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో డాక్టర్లు కావాలనే జిల్లా విద్యార్థుల ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఈమేరకు భువనగిరి పట్టణ శివారులోని పగిడిపల్లి సమీపంలోని పాత కలెక్టరేట్‌ భవనం లో వైద్య కళాశాల ఏర్పాటుకానుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలను పరిశీలించినప్పటి కీ పాత కలెక్టరేట్‌ భవనమే అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇందుకనుగుణంగా భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిని నూతనంగా ఏర్పాటుకానున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రిగా గుర్తిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన పాలనా సవరణలు ఈపాటికే పూర్తయ్యాయి. అయితే యాదగిరిగుట్టలో కేటాయించిన 20ఎకరాల స్థలంలో శాశ్వత భవననిర్మాణాలు పూర్తయ్యాక వైద్య కళాశాలనుఅక్కడికే తరలిస్తారు.

2023లోనే కళాశాల మంజూరు

జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల అంటూ నాటి బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం యాదాద్రి భువనగిరి జిల్లాకు 2023, జూలై 6వ తేదీన ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. కళాశాలకోసం యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో సర్వే నెం. 64లో 20ఎకరాల స్థలాన్ని కేటాయించి భవనాల నిర్మాణానికి రూ.183కోట్లు మంజూరు చేసింది. అయితే అప్పటికే శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య అవసరాలకోసం అక్కడి పీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ 29 నవంబరు, 2022న జీవో 772ను జారీచేసింది. ఆసుపత్రి నిర్మాణానికి అప్పట్లోనే శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం మంజూరైన వైద్యకళాశాలకు ఆ 100 పడకల ఆసుపత్రికి అనుబంధ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని వైద్య కళాశాల మంజూరు సమయంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ సాంకేతిక కారణాలతో జిల్లా కు మంజూరైన వైద్య కళాశాలను జిల్లాలోనే ఏర్పాటు చేసే అంశంపై కాస్త గందరగోళం నెలకొని రాజకీయ వివాదాలకు దారితీసింది. ఈ మేరకు అప్రమత్తమైన ఆ ప్రభుత్వం జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు మార్గమం సుగుమంచేయడంతో కళాశాల తరలింపు వివాదానికి తెరపడింది.

శాశ్వత భవవనాల నిర్మాణం పూర్తయ్యాక యాదగిరిగుట్టకే..

జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను తాత్కాలికంగా భువనగిరిలోని పాత కలెక్టరేట్‌ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. కళాశాలకోసం యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్‌లో కేటాయించిన 20ఎకరాలను శాశ్వత భవనాలనిర్మాణం పూర్తయ్యాక ప్రభు త్వ వైద్యకళాశాలను అక్కడికే తరలించనున్నారు. ఈమేరకు భువనగిరిలో కళాశాల ఏర్పాటుతోపాటు యాదగిరిగుట్ట మల్లాపూర్‌లో శాశ్వత భవననిర్మాణ పనులు కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

అనుబంధ ఆసుపత్రిగా భువనగిరి జిల్లా ఆసుపత్రి

భువనగిరి శివారులో తదుపరి విద్యా సంవత్సరంనుంచి 50 సీట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభంకానుంది. ఈమేరకు స న్నాహాలు ప్రారంభమయ్యాయి. పట్టణ శివారులోని పాత కలెక్టరే ట్‌భవనంలో తాత్కాలికంగా వైద్య కళాశాల ఏర్పాటుఖరారైంది. వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రిగా భువనగిరిలోని వంద ప డకల జిల్లా ఆసుపత్రిని పేర్కొంటూ ఉత్తర్వులు కూడా వెలువడ్డా యి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, కళాశాలల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రులు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అడ్మినిస్ర్టేటీవ్‌ (డీఎంఏ) పరిధిలో కొనసాగుతాయి. కానీ భువనగిరిలోని జిల్లా ఆసుపత్రి ఇప్ప టి వరకు వైద్య విధాన పరిషత్‌ పర్యవేక్షణలో ఉంది. కానీ భువనగిరిలోనే ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ఖరారు కావడంతో జి ల్లా ఆసుపత్రిని డీఎంఏ పరిధిలోకి చేరుస్తూ అధికారులు ఉత్తర్వు లు జారీచేశారు. ఇందుకనుగుణంగా జిల్లా ఆసుపత్రిలోని 29 వైద్య విధాన పరిషత్‌ ఆధీనంలోని రామన్నపేట, ఆలేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు బదిలీచేశారు. నూతన సిబ్బంది నియమితులయ్యే వరకు బదిలీ అయిన వారంతా ఇక్కడే విధులు నిర్వహిస్తారు. వైద్యులతోపాటు మిగతా సిబ్బందికి కూడా బదిలీలు తప్పవని తెలుస్తోంది. త్వరలోనే జిల్లా ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా డీఎంఏ పరిధిలోకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే భువనగిరిలో ఏర్పా టు కానున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ మల్లిఖార్జున్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఉస్మానియా వైద్యకళాశాల జనరల్‌ సర్జన్‌ హెచ్‌వోడీగా కొనసాగారు. 2, 3 రోజు ల్లో వైద్య కళాశాల ఏర్పాటు పనులు ముమ్మరం కానున్నాయి.

Updated Date - Feb 15 , 2024 | 11:57 PM