Share News

గోపాలమిత్రలను క్రమబద్ధీకరించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:28 AM

పశుసంవర్ధక శాఖలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న గోపాలమిత్రలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని గోపాలమిత్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మాదబోయిన రవీంద్రముదిరాజ్‌ కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

గోపాలమిత్రలను క్రమబద్ధీకరించాలి
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరిస్తున్న గోపాలమిత్ర జేఏసీ నాయకులు

సీఎం రేవంత్‌రెడ్డికి గోపాల మిత్ర జేఏసీ వినతి

నల్లగొండ, జూలై 4: పశుసంవర్ధక శాఖలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న గోపాలమిత్రలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని గోపాలమిత్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మాదబోయిన రవీంద్రముదిరాజ్‌ కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోపాలమిత్రలు పశువులకు టీకాలు వేయడం, బీమా ఇతర సేవలను పశువైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్నారన్నారు. ఏటా 14లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో ఇప్పటి వరకు సుమారు 3లక్షల దూడలకు జన్మనిచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో గోపాలమిత్రలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,530మంది 23 ఏళ్లుగా సేవలందిస్తున్నారని వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల వేతనం ఇవ్వడంతో పాటు 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని, ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గోపాలమిత్ర జేఏసీ నాయకులు పల్స మహేశ్వర్‌, మూడావత్‌ దశరథ్‌, రఘురామకృష్ణ, బందయ్య, బుచ్చిరెడ్డి, శివరామకృష్ణ, ఎండీ ఫరూక్‌, ఎండీ ఫయాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:28 AM