‘పది’లో సత్ఫలితాలు సాధించాలి: డీఈవో
ABN , Publish Date - Feb 16 , 2024 | 12:10 AM
పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాఽధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. గురువారం మండల పరిధిలో ని వెలిమినేడు, గుండ్రాపల్లిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.
చిట్యాల రూరల్, ఫిబ్రవరి 15: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాఽధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. గురువారం మండల పరిధిలో ని వెలిమినేడు, గుండ్రాపల్లిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పా ఠశాలల్లో రికార్డులను, రిజిస్టర్లను తనిఖీచేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల కు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను విన్నారు. ప్రత్యేక తరగతుల ద్వారా వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలన్నారు. పరీక్షలంటే భయపడకుండా ఇష్టంగా రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు.