బిక్కేరులో గోదారమ్మ పరవళ్లు
ABN , Publish Date - Oct 15 , 2024 | 01:03 AM
కరువు నేలపై జలసిరులు సవ్వడి చేస్తున్నాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు వస్తున్నాయి.
యాసంగీలో తీరనున్న సాగునీటీ సమస్య
రైతుల మోములో ఆనందం
మోత్కూరు/ అడ్డగూడూరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కరువు నేలపై జలసిరులు సవ్వడి చేస్తున్నాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు వస్తున్నాయి. గంధమల్ల చెరువు అలుగుపోస్తుడంతో రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకురు( ఎం), గుండాల మీదిగా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులోని వంగాల, సదర్‌షాపురం నుంచి అడ్డగూడూరు మండలంలోని చిన్నపడిశాల చెక్క్‌డ్యామ్ వరకు జలకళను సం తరించుకుంది. గోదావరి జలాలు వస్తుండడంతో రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. ఏడాదిగా వానకాలం నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో అడ్డగూడూరు మండలంలోని బిక్కేర ు వాగు చుట్టుపక్కల ఉన్న చెరువులు అడుగంటాయి. దీంతో వానాకాలం రైతులు అంతంత మాత్రంగానే వరి సాగు చేశారు. గోదావరి జ లాల రాకతో బిక్కేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. యాసంగి సాగుకు నీటి సమస్య తీరే అవకాశం ఉంది.
చెక్ డ్యాం నుంచి నీరు లీకేజీ
మోత్కూరు మండలం సదర్శాపురం చెక్ డ్యాంలో నీరు నిల్వ ఉండకుండా చెక్‌డ్యాం కింద నుంచి నీరు లీక్ అయి వెళ్లిపోతోన్నదని ఆ గ్రా మ రైతులు ఆవేదన చెందుతున్నారు. మో త్కూరు మండలంలో ఈ ఏడాది భారీ వర్షాలు కురవక పోవడంతో బిక్కేరు వాగులోకి నీరు రాలేదు. మోత్కూరు నుంచి అడ్డగూడూరు మం డలం ధర్మారం, లక్ష్మీదేవికాల్వ వరకు వందలాది మంది రైతులు బిక్కేరు వాగులో చేతి బోర్లు వేసి, కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసుకుని నీరు తీసుకెళ్లి పంటలు సాగు చేస్తున్నారు. ఈ యేడాది బిక్కేరు వాగులోకి నీరు రాకపోవడంతో వాగులో ఉన్న బోర్లకు నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ సీఎం రేవంతరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారు ల దృష్టికి ఇక్కడి నీటి సమస్యను తీసుకెళ్లి గందమల్ల రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు వి డుదల చేయించారు. బిక్కేరులో వస్తున్న గోదావరి జలాలు సదర్శాపురం చెక్‌డ్యాంలో ఏమాత్రం నిల్వ ఉండకుండా వచ్చిన నీరు వచ్చినట్టుగా చెక్ డ్యాం కిందనుంచి వెళ్లిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణ లోపమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఐబీ ఏఈ అమర్ మాట్లాడుతూ చెక్‌డ్యాంను పరిశీలించానన్నారు. ఒక చోట కొద్ది గా నీరు లీకేజీ అవుతున్నప్పటికీ చెక్‌డ్యాంలో నీరు నిల్వ ఉంటున్నదన్నారు. నీరు తగ్గాక లీకేజీ ఉన్న చోట మరమ్మతు చేయిస్తామన్నారు.
యాసంగికి ఇబ్బంది ఉండదు
నీళ్లు లేకపోడం వల్ల వానకాలం మా ప్రాంతంలో సాగు భూములు పడావుగా ఉన్నాయి. ఇప్పుడు గోదావరి జలాలతో బిక్కేరు వాగు పారుతుండడంతో ఆనందంగా ఉంది. బోరు, బావుల్లోకి నీరు పైకి వచ్చే అవకాశం ఉంది. యాసంగీలో ఆరు ఎకరాలు నాటు వేస్తాం..
-కొప్పుల నిరంజనరెడ్డి, రైతు, చిన్నపడిశాల గ్రామం
సంతోషంగా ఉంది
కాళేశ్వరం జలాలతో బిక్కేరు వాగు పారుతోంది. యాసంగిలో వరి సాగు పెరిగే ఆవకాశం ఉంది. వానా కాలంలో రెండు ఎకరాలు వరి సాగు వేశాను. కానీ నీరు లేకపోవడంతో ఎండిపోతోంది. గోదావరి జలాలు వస్తుడంతో చాలా సంతోషంగా ఉంది.
-ఓర్సు నవీన, రైతు, చిన్నపడిశాల
-----------