Share News

చిట్యాలలో గంజాయి విక్రేతల అరెస్టు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:12 AM

గంజాయిని రవాణా విక్రేతలను అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా చిట్యాల సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 చిట్యాలలో గంజాయి విక్రేతల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగరాజు

చిట్యాల, ఏప్రిల్‌ 7 : గంజాయిని రవాణా విక్రేతలను అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా చిట్యాల సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారంతో ఆదివారం చిట్యాలలో వాహనాల తనిఖీ చేస్తుండగా హైదరాబాద్‌ నుంచి నార్కట్‌పల్లి వైపు బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఆపి ప్రశ్నించామన్నారు. పారిపోవడానికి ప్రయత్నించడంతో పట్టుకుని విచారించగా నల్లగొండ మండలం పానగల్‌కు చెందిన కొడిదల జగదీష్‌, కొడిదల అంజి, చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన రూపని నితినగా చెప్పారన్నారు. వారు హైదరాబాద్‌లో గంజాయి కొనుగోలు చేసి చిట్యాలలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3 వేల విలువైన 150 గ్రాముల గంజాయితో పాటు మోటారుబైక్‌, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 12:12 AM