Share News

విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:21 AM

విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రభుత్వం నిధు లు పెంచాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంతవర్మ డిమాండ్‌ చేశారు.

విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూలై 27 : విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రభుత్వం నిధు లు పెంచాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంతవర్మ డిమాండ్‌ చేశారు. శనివారం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయి ఉన్న విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిపులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో గురుకులాల్లో విద్యార్థు లు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలపై సమగ్ర న్యా య విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1400 మంది విద్యార్థులు చదువుతున్నారని వారికి సరిపడా తరగతి గదులు లేవన్నారు. ప్రభు త్వ వసతి గృహాల్లో అనేక సమస్యలుఉన్నాయని, విద్యార్థులు అరకొర వసతుల మధ్య ఉంటూ విద్యనభ్యసిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధర్నా వద్దకు రావాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్‌లోని వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. పోలీసులు కలెక్టరేట్‌ గేట్లు మూసివేసి కలెక్టరేట్‌లోని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కలెక్టరేట్‌ ఏవో సుదర్శనరెడ్డి విద్యార్థుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వినోద్‌, వినయ్‌, శ్రవణ్‌, విష్ణు, తన్వేష్‌, అనిల్‌, సుమన, నవ్య, శృతి, గోపి, సంధ్య, అభి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:21 AM