Share News

స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:25 AM

స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర 16వ ఆర్థిక కమిషన చైర్మన పానగరియాకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కుడుదుల నగేష్‌ వినతి పత్రం అందచేశారు.

 స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 9: స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర 16వ ఆర్థిక కమిషన చైర్మన పానగరియాకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కుడుదుల నగేష్‌ వినతి పత్రం అందచేశారు. సోమవారం హైదరాబాద్‌లోని జ్యోతిబా పూలే ప్రజాభవనలో భారత ప్రభుత్వ 16వ ఫైనాన్స కమిషన చైర్మన అరవింద్‌ పానగరియా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్‌ నగేష్‌ మాట్లాడుతూ 13వ ఫైనాన్స తీర్మానం ప్రకారం గ్రామ పంచాయతీలకు 50శాతం, మండల ప్రజాపరిషతలకు 30శాతం, జిల్లా పరిషతలకు 20శాతం నిధులు కేటాయించాలని, బీఆర్‌జీఎస్‌ నిధులు కూడా కలిపి మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు రెన్యూవల్‌ చేయాలన్నారు. పంచాయతరాజ్‌ శాఖ ద్వారా అభివృద్ధి పనుల నిధులకు రూ.5లక్షల వరకు కేటాయించే పనులకు జీఎస్టీని 18శాతం నుంచి 0 శాతానికి చేయాలని జిల్లా పరిషతలకు ఫైనాన్స కమిషన ఇచ్చే హెల్త్‌ గ్రాంట్‌ వర్క్‌ సెలక్షన హక్కు జిల్లా పరిషతలకే కేటాయించాలని, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషతలకు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 12:25 AM