స్వాతంత్య్ర సమరయోధుడు రామచంద్రారెడ్డి సతీమణి పూలమ్మ కన్నుమూత
ABN , Publish Date - Jan 14 , 2024 | 11:39 PM
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కోటపహాడ్ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కందాళ చిన్న రామచంద్రారెడ్డి సతీమణి కందాళ పూలమ్మ(90) ఆదివారం స్వగృహాంలోని కోటపహాడ్‌లో మృతి చెందారు.
ఆత్మకూర్(ఎస్), జనవరి 14 : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కోటపహాడ్ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కందాళ చిన్న రామచంద్రారెడ్డి సతీమణి కందాళ పూలమ్మ(90) ఆదివారం స్వగృహాంలోని కోటపహాడ్‌లో మృతి చెందారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చిన్న రామచంద్రారెడ్డి వీరోచిత ఉద్యమాలు చేశారు. మృతురాలు పూలమ్మ కొంతకాలంగా వృద్ధాప్యంతో అనారోగ్యానికి గురై ఆదివారం మృతి చెందారు. పూలమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ వెంకటరెడ్డికి సమీప బంధవు.