సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:33 AM
ప్రభుత్వానికి, మిల్లర్లు చెల్లించాల్సిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు నమోదుచేసి, ఆస్తులను జప్తు చేస్తామని ఈటీఎఫ్, టాస్క్‌ఫోర్స్ ఓఎ్‌సడీ డి.అంజయ్య హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని శ్రీలక్ష్మి ట్రేడర్స్, హర్షి త రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
ఈటీఎఫ్, టాస్క్‌ఫోర్స్ ఓఎ్‌సడీ డి.అంజయ్య
తిరుమలగిరి, సెప్టెంబరు 20: ప్రభుత్వానికి, మిల్లర్లు చెల్లించాల్సిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు నమోదుచేసి, ఆస్తులను జప్తు చేస్తామని ఈటీఎఫ్, టాస్క్‌ఫోర్స్ ఓఎ్‌సడీ డి.అంజయ్య హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని శ్రీలక్ష్మి ట్రేడర్స్, హర్షి త రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలగిరిలో రెండు మిల్లులను ప్రభుత్వం డీఫాల్ట్‌గా గుర్తించిందన్నారు. రెం డు మిల్లుల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ ఇవ్వకుండా, మోసపూరితంగా, స్వార్థపూరితంగా వ్యవహరించాయన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు వారి సొంతానికి వాడుకున్నట్లు తెలిపారు. శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఓనర్ గజ్జి ఉపేందర్, 2022-23 యాసంగి, 2023-24 వానాకాలం రెండు సీజన్లకు సంబంధించి 2,916 క్వింటాళ్ల రైస్ పెండింగ్‌లో ఉందన్నారు. యాసంగికి రూ.9,58,85,000, వానాకాలానికి రూ.5.50కోట్లు, హర్షిత మిల్లు ఓనర్ తునికిపాటి వినయ్‌కుమార్ ద్వారా రూ.10కోట్ల బకాయి ఉన్నట్లు తెలిపారు. రెండు మిల్లులపై అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఉన్న బకాయి చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎ్‌స వో ఈశ్వర్, అసిస్టెంట్ మేనేజర్ బెనర్జి, తహసీల్దార్ హరిబాబు, సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.