Share News

ఖాజీమొహల్లా దర్గా కొలనులోని చేపలు మృతి

ABN , Publish Date - May 29 , 2024 | 11:13 PM

భువనగిరి పట్టణం ఖాజీమొహల్లాలోని హజ్రత జమాల్‌ఉల్‌ బాహర్‌ దర్గా కొలనులో చేపలు మృతి చెందాయి.

ఖాజీమొహల్లా దర్గా కొలనులోని చేపలు మృతి
దర్గా కొలనులో మృతి చెందిన చేపలు

భువనగిరి టౌన, మే 29: భువనగిరి పట్టణం ఖాజీమొహల్లాలోని హజ్రత జమాల్‌ఉల్‌ బాహర్‌ దర్గా కొలనులో చేపలు మృతి చెందాయి. దర్గా సందర్శనకు వచ్చే భక్తులు తమ మొక్కులో భాగంగా కొలనులో వేస్తున్న పదార్థాలను చేపలు ఆహారంగా స్వీకరిస్తూ అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో చేపలు మృతి చెందగా ఆహార పదార్థాలను కొలనులో వేయరాదని సూచించినప్పటికీ భక్తులు చూపుతున్న నిర్లక్ష్యంతో మరోమారు చేపలు మృతి చెందాయని అన్నారు. ఈ మేరకు నీట తేలిన మృత చేపలను కౌన్సిలర్‌ పంగరెరక్క స్వామి, మునిసిపల్‌ సిబ్బందితో కలిసి బుధవారం కొలను నుంచి వెలికి తీయించారు. త్వరలోనే కొలనును శుభ్రం చేయిస్తామని కౌన్సిలర్‌ తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 11:13 PM