ఖైదీల కుటుంబాలకు ఆర్థిక భరోసా
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:26 AM
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌ను నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తూ, ఖైదీల్లో పరివర్తన తీసుకువస్తూనే వారి కుటుంబాలకు ఆర్థికభరోసా కల్పిస్తున్నామని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు.

జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా
సూర్యాపేట రూరల్, జూన 26 : జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌ను నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తూ, ఖైదీల్లో పరివర్తన తీసుకువస్తూనే వారి కుటుంబాలకు ఆర్థికభరోసా కల్పిస్తున్నామని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. బుధవారం సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవర్, ఎస్పీ సనప్రీతసింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, ఇతర ప్రాంత ప్రజలకు ఇక నుంచి నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ మాట్లాడుతూ ప్రజలకు పెట్రోల్ బంక్ ద్వారా నాణ్యమైన డీజిల్, పెట్రోల్ అందించాలని ప్రభుత్వం జైళ్ల శాఖ ద్వారా బంక్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ఖైదీలకు మంచి ప్రవర్తన ప్రధానమన్నారు. జైళ్ల శాఖ ద్వారా ఏర్పాటుచేసిన బంక్‌లతో మెరుగైన సేవలు అందజేయాలన్నారు. తప్పు చేసిన వారిని మంచి మార్గంవైపు నడిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాజం తీరుపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎస్పీ సనప్రీతసింగ్ మాట్లాడుతూ జైళ్ల శాఖ ద్వారా నిర్మించిన ఈ పెట్రోల్ బంక్‌లకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.
బయట పెట్రోల్ బంక్‌ల్లో జరుగుతున్న మోసాలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైల్‌ను జైళ్ల డీజీ పరిశీలించారు. జైలులో రిమాండ్ ఖైదీలు తయారుచేసిన వివిధ వస్తువులను పరిశీలించారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ ఎన మురళీబాబు, జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీ రవి, ఇండియన ఆయిల్ డివిజన రిటైల్స్ సేల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.శ్రీకాంత, జిల్లా సబ్‌జైలు అధికారి ఆర్.శోభనబాబు, సూపరింటెండెంట్ సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.