Share News

నేటి నుంచి గ్రామ దేవతల ఉత్సవాలు

ABN , Publish Date - May 02 , 2024 | 11:50 PM

మండల కేంద్రంలో ఈనెల 3 నుంచి 5 వరకు గ్రామ దేవతలు, శ్రీరామలింగేశ్వస్వామి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

  నేటి నుంచి గ్రామ దేవతల ఉత్సవాలు

ఆత్మకూరు(ఎం), మే 2: మండల కేంద్రంలో ఈనెల 3 నుంచి 5 వరకు గ్రామ దేవతలు, శ్రీరామలింగేశ్వస్వామి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ శుక్రవారం శివాలయంలో విఘ్నేశ్వరస్వామిపూజ, స్వస్తివాచనం, రక్షాబంధన, హోమం, అభిషేకాలు, గరుడబలి, ధ్వజారోహణం, ఇదే రోజు రాత్రి శివపార్వతుల కణ్యాణోత్సవం జరిపిస్తారు. 4వ తేదీ శనివారం ఉదయం నుంచి, బొడ్రాయికి ప్రత్యేక పూజలు. తదనంతరం మహిళలలు జలకడవలతో జలాభిషేకం చేస్తారు. రాత్రి శివపార్వతులను మేఘరథంపై ప్రధాన వీదుల గుండా ఊరేగిస్తారు. 5వ తేదీ ఆదివారం బొడ్రాయితోపాటు గ్రామంలోని ఎల్లమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, కనకదుర్గమ్మ, కట్టమైసమ్మ, సాగుబాయిమైసమ్మ గ్రామదేవతలకు బోనాల సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి.

Updated Date - May 02 , 2024 | 11:50 PM