Share News

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:45 PM

భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆధుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
వలిగొండ: సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌

వలిగొండ, ఫిబ్రవరి 27: భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆధుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బునాదిగాని కాల్వలో నీరు లేక ఎండిపోవడంతో దానిపై ఆధారపడ్డ సుమారు 10 గ్రామాల్లో వరి పంటను సాగు చేసుకున్న రైతులు నీరులేక భూగర్భజలాలు అడుగంటి ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సక్రమంగా లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీబీనగర్‌ మక్తానంతారం గ్రామం వద్ద మూసీ నీటిని బునాదిగాని కాల్వలోకి మళ్లించి పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడాలని, విద్యుత కోతలు లేకుండా 8గంటల కరెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశం మద్దెల రాజయ్య అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, భట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలంరెడ్డి, తుర్కపల్లి సురేందర్‌, కట్కూరి రాంచందర్‌, గణపతిరెడ్డి, నాయకులు కిష్టయ్య, భూపాల్‌, అంజనేయులు, వెంకట్‌రెడ్డి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

చౌటుప్పల్‌ టౌన : చౌటుప్పల్‌ పట్టణంలోని సర్వే నంబరు 356 లోని వక్ప్‌ భూమి కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. వక్ప్‌ భూములను సర్వే చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండల వక్ప్‌ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో శేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ భూముల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వక్ఫ్‌ భూములను సర్వే చేసి హద్దులను గుర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వక్ఫ్‌ భూముల పరిరక్షణ వేదిక నాయకులు ఇక్బాల్‌, ఎండి.పాషా, గోరెమియా, లతీఫ్‌, ఎండి.గౌస్‌, రహీమ్‌, రఫీ, ఖయ్యూమ్‌, సీపీఎం పట్టణ కార్యదర్శి బండారు నర్సింహ, ధర్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:45 PM