Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:59 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కోదాడలోని ఓ ఫంక్షనహాల్‌లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల ఎత్తిపోతల పథకాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌
సమీక్షా సమవేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేదికపై ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కలెక్టర్‌ వెంకటరావు

చివరి ఆయకట్టు వరకూ నీరందిస్తాం

చెరువు ఆక్రమణదారులపై కేసులు

మరమ్మతులకు లక్షలు ఖర్చవుతాయని వెనకాడొద్దు

సకాలంలో ఎత్తిపోతలను అందుబాటులోకి తేవాలి

కోదాడ, జూన 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కోదాడలోని ఓ ఫంక్షనహాల్‌లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల ఎత్తిపోతల పథకాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ వానాకాలం సీజన ప్రారంభం అవుతున్న తరుణంలో ఈలోపే ఎత్తిపోతల పథకాల పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కోదాడ, హుజూర్‌నగర్‌ పరిధిలో ఇంజనీర్ల కొరత ఉందని హుజూర్‌నగర్‌ పరిధిలో 18 మంది ఏఈలు అవసరం ఉండగా 11 మంది ఉన్నారని, కోదాడ పరిధిలో 16 మందికి 13 మంది ఎఈలు ఉన్నట్లు మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అందుకు మంత్రి స్పందిస్తూ సిబ్బంది తక్కువగా ఉంటే తీసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా యుద్ధప్రాతిపదికన పనిచేసి ఎత్తిపోతల పథకాలను సకాలంలో అందుబాటులోకి తేవాలని మంత్రి అన్నారు. వందల కోట్లు చేసి ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు చిన్నచిన్న మరమ్మతులకు రూ.లక్షలు ఖర్చవుతుందని వెనకాడవద్దన్నారు. అలా చేయడం వల్ల వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నోచుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతులకు ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఇరిగేషన అధికారులు కలెక్టర్‌ వెంకటరావుతో పాటు ఇతర శాఖల అధికారులను, రైతులను సమన్వయం చేసుకుంటూ సాంకేతిక సమస్యలుంటే అధికమించి పనులను వేగవంతం చేయాలన్నారు. చెరువులు రికార్డుల్లో ఎంత ఉంటే అంతే ఉండాలి తప్ప మట్టి పేరుతో ఆక్రమణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఆక్రమణలపై మిన్నకుంటే భవిష్యత తరాలకు ఏమీ ఉండదన్నారు. ఆక్రమణలను సీరియ్‌సగా తీసుకుని ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూడికను రైతులు సొంత ప్రయోజనాలకు వాడుకోవచ్చునని తెలిపారు. విద్యుత లోవోల్టేజీ సమస్య ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. సమస్య పేరుతో కాలయాపన చేస్తూ పొలాలకు నీరందకుండా చేయడం సరికాదన్నారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ వెంకటరావు, ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, రాష్ట్ర ఇరిగేషన చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌రావు, ఎస్‌ఈ నరసింహారావు, మునిసిపల్‌ చైర్‌పర్సన సామినేని ప్రమీల, కాంగ్రెస్‌ నాయకులు సామల శివారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:59 PM