కోర్టు భవనాల్లో వసతులు కల్పించాలి
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:27 AM
జిల్లాలోని కోర్టు భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ.జయరాజు అన్నారు. మంగళవారం ప్రధాన న్యాయాధికారిని కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు
భువనగిరి టౌన్, జనవరి 9: జిల్లాలోని కోర్టు భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ.జయరాజు అన్నారు. మంగళవారం ప్రధాన న్యాయాధికారిని కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. భువనగిరిలో జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి కేటాయించిన 10 ఎకరాల స్థలానికి హద్దులు నిర్ణయించి చదును చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ప్రస్తుత జిల్లా కోర్టు ఆవరణ ఆధునికీకరణ, పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. యాదగిరిగుట్టకు మంజూరైన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును తాత్కాలిక బీసీ సంక్షేమ వస తి గృహంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇందుకోసం అవసరమైన మరమ్మతు లు చేయించాలని, శాశ్వత భవన నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రధానన్యాయాధికారి చేసిన సూచనకు కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని అన్ని కోర్టు భవనాల్లో వసతులు కల్పించాలని, ఇందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కలెక్టర్‌కు వివరించారు. సమస్యలన్నింటినీ పరిష్కరించి కోర్టుల నిర్వహణకు జిల్లా పాలనాయంత్రాంగం తరఫున పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ అన్నారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె మారుతీ దేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.దశరథ రామయ్య పాల్గొన్నారు.