Share News

గుత్తా నిర్ణయంపైనే అందరి ఆసక్తి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:36 AM

తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి, సోదరుడు జితేందర్‌రెడ్డి పార్టీ మారడం, తాను సైతం ఇప్పటికే బీఆర్‌ఎ్‌సపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి ఎలాంటి నిర్ణ యం తీసుకుంటారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

గుత్తా నిర్ణయంపైనే అందరి ఆసక్తి

కాంగ్రెస్‌ గూటికి అమిత్‌

సీఎం సమక్షంలో చేరిక

మదర్‌ డెయిరీ చైర్మన్‌ జితేందర్‌రెడ్డి సైతం

గుత్తా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కోమటిరెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదా్‌సమున్షి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి, సోదరుడు జితేందర్‌రెడ్డి పార్టీ మారడం, తాను సైతం ఇప్పటికే బీఆర్‌ఎ్‌సపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి ఎలాంటి నిర్ణ యం తీసుకుంటారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రాజ్యాంగబద్ధమైన పదవికావడంతో, పదవీకాలం పూర్తయ్యేంతవరకు పార్టీరహితంగా అలాగే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరుతారా? అనే అంశంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సైతం మండ లి చైర్మన్‌ విషయంలో ఎలా ముందుకు సాగుతుందో తేలితేనే సుఖేందర్‌రెడ్డి అంశంపై స్పష్టత రానుంది.

మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఆ స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగాలని భావించిన అమిత్‌రెడ్డికి అవకాశం దక్కలేదు. ఆ తదుపరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి ప్రయత్నించినా వీలుకాలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏదోఒక చోట బరిలో ఉండాలని తొలుత భావించినా ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు సుముఖంగా లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించా రు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు గుత్తా వర్గీయులు సహకరించలేదని, అందువల్లే పార్టీ అభ్యర్థులు ఓడిపోయారంటూ పలువురు మా జీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినప్పటి నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డికి, మాజీమంత్రి జగదీ్‌షరెడ్డికి, మాజీ ఎమ్మెల్యేలకు నడుమ కోల్డ్‌వార్‌, మాటల యుద్ధాలు నడిచాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ సుఖేందర్‌రెడ్డి సైతం పలు సందర్భాల్లో మీడియాతో పిచ్చాపాటిగా, ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఓటమికి అప్పటి మంత్రుల వైఖరే కారణమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నిజంగా తన వర్గమే కారణమైతే తాను బలవంతుడినని ప్రజలు గుర్తించినట్లేనని కూడా వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానంటూనే పలు సందర్భాల్లో సుఖేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌ పాలన బాగుందని కితాబిచ్చారు. బీఆర్‌ఎ్‌సలో నియంతృత్వ విధానాలు అమలవుతున్నాయని, పార్టీలో సమీక్షలు, చర్యలు ఉండకపోవడం వల్లే పార్టీకి ఈ దుస్థితి తలెత్తిందని కామెంట్లు చేశారు. అదే సమయంలో అమిత్‌ బీఆర్‌ఎ్‌సలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేయడంతో పాటు పూర్వపుపరిచయాలు, బంధుత్వాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. భువనగిరి నుం చి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానం మేరకు అమిత్‌రెడ్డి, ఆయన బాబాయి జితేందర్‌రెడ్డి సోమవారం కాంగ్రె్‌సలో చేరారు. ప్రస్తుతానికి ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరినప్పటికీ భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, అమిత్‌ రాజకీ య భవిష్యత్‌ని తమకు వదిలేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లు సుఖేందర్‌రెడ్డి వర్గీయులు పేర్కొన్నారు.

ఆయన వర్గీయులు కాంగ్రె్‌సలోకే

సుఖేందర్‌రెడ్డి వర్గీయులుగా పేర్కొంటున్న పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరగా, మిగిలినవారు కూడా అమిత్‌బాటలో కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నల్లగొండ, దేవరకొండ, మునుగోడు తదితర నియోజకవర్గాల్లో కొందరునేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరగా, మిర్యాలగూడ మునిసిపల్‌ చైర్మన్‌, 13మంది కౌన్సిలర్లు, మరో ఇద్దరు మాజీ మునిసిపల్‌ చైర్మన్లు, మరికొందరు నాయకులు కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమయ్యారు. అక్కడ స్థానికనేతలతో సర్ధుబాట జరిగితే వారి చేరిక ప్రక్రియ పూర్తికానుంది. గుత్తావర్గానికే చెందిన జడ్పీ వైస్‌చైర్మన్‌, మరికొందరు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు సైతం త్వరలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకుంటారని సుఖేందర్‌రెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు.

గుత్తా ఇంటికి కాంగ్రెస్‌ ముఖ్యులు

లోక్‌సభ ఎన్నికల ముంగిట ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, సోదరుడు మదర్‌డెయిరీ మాజీ చైర్మన్‌ జితేందర్‌రెడ్డి సోమవారం కాంగ్రె్‌సలో చేరారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అంతకుముందు ఉద యం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ ఇన్‌చార్జి దీపాదా్‌సమున్షితో కలిసి హైదరాబాద్‌లో గుత్తా నివాసానికివెళ్లి పార్టీలో చేరాల్సిందిగా అమిత్‌ని, జితేందర్‌ని ఆహ్వానించారు. గుత్తా కుటుంబీకులు కాంగ్రె్‌సలో చేరే అంశంపై గతంలోనే మంత్రి కోమటిరెడ్డితో, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డితో చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 30 , 2024 | 12:36 AM