Share News

నేటి నుంచి ‘పది’ జవాబుపత్రాల మూల్యాంకనం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:01 AM

పదో తరగతి వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంక నం నేటినుంచి రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం కోసం భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్‌లో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి ‘పది’ జవాబుపత్రాల మూల్యాంకనం

1.45 లక్షల జవాబు పత్రాలు

ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 2: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంక నం నేటినుంచి రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం కోసం భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్‌లో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1.45 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. అయితే ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అంటున్నారు. అయితే గత సంవత్సరం 1.23 లక్షల జవాబుపత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేశారు. అనగా గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 22వేల జవాబుపత్రాల మూల్యాంకనం పెరగనుంది.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం దివ్యాబాల హైస్కూల్‌లో విద్యాశా ఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వర కు మూల్యాంకనం జరుగుతుంది. ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ ప్రతీ రోజు 40 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఒక్కో జవాబు పత్రానికి మూల్యాంకనం భృతిగా రూ.10విద్యాశాఖ చెల్లిస్తుంది. జిల్లాలోని కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే మూల్యాంకనం విధులకు ఎంపిక చేసి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత సంవత్సరం మూల్యాంకన భృతి నాలుగు రోజుల క్రితం అందడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఈ సంవత్సరం మాత్రం మూల్యాంకనం చివరి రోజే భృతిని అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూల్యాంకనం కేంద్రం వద్ద పోలీసులు ప్రత్యేక బందోబప్తు ఏర్పాటు చేశారు. అధికారులు సహా ఎవరి సెల్‌ఫోన్లను మూల్యాంకనం కేంద్రంలోకి అనుమతంచరు. మూల్యాంకనం మార్పులను ఎప్పటికప్పుడు విద్యాశాఖ ప్రత్యేక పోర్టర్‌లో పొందుపరుస్తారు.

మూల్యాంకన విధుల్లో 910 మంది

1.45లక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధుల్లో సుమారు 910మంది పాల్గొననున్నారు.క్యాంపు అధికారిగా డీఈవో డాక్టర్‌ కె.నారాయణ రెడ్డి వ్యవహరిస్తారు. అలాగే డి ప్యూటీక్యాంపు (అడ్మిన్‌) అధికారిగా-1, డిప్యూటీ క్యాంపు (స్ట్రాంగ్‌ రూం) అధికారి-1, అసిస్టెంట్‌ క్యాంపు అధికారులు-8,చీఫ్‌ ఎగ్జామినర్లు-100, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు-600, స్పెషల్‌ అసిస్టెంట్లు-200మంది.అలాగే మరి కొంతమంది ఇతర పనుల్లో సాయపడనున్నరు. ఉ న్నతాధికారులు రోజువారిగా మూల్యాంకనం కేంద్రాన్ని పరిశీలించి పర్యవేక్షించనున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:01 AM