Share News

అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:17 AM

మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం కల్పించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు.

అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మల్లు లక్ష్మి

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

నల్లగొండ రూరల్‌, మార్చి 7: మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం కల్పించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. నల్లగొండలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం జరిగే పోరాటాలకు స్ఫూర్తినిచ్చే రోజు మార్చి 8 అని అన్నారు. మహిళలకు పని, భద్రత కల్పించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, మహిళపై హింస, లైంగిక వేధింపులు అనేక రూపాల్లో జరుగుతున్నాయన్నారు. వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కొండా అనురాధ, జిట్ట సరోజ, తుమ్మల చెన్నబోయిన నాగమణి, భూతమ అరుణకుమారి, కారంపొడి ధనలక్ష్మి, చనబోయిన సైదమ్మ, ఎస్‌కె.సుల్తానా, గొల్ల వెంకటమ్మ, ఊర్మిళ, అరుణ, కృష్ణవేణి, ఇందిరా, లీగల్‌ సెల్‌ వర్ణ, ఉమా, పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:17 AM