Share News

మహిళల ఆర్థిక భరోసాకు ఉపాధికార్యక్రమాలు

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:46 AM

మహిళల ఆర్థిక భరో సా కోసం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు రోడ్లుభవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో వివిధ వ్యర్థాలతో రూపొందించిన చేతి ఉత్పత్తుల శిక్షణ, ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

మహిళల ఆర్థిక భరోసాకు ఉపాధికార్యక్రమాలు

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, పిబ్రవరి 11: మహిళల ఆర్థిక భరో సా కోసం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు రోడ్లుభవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో వివిధ వ్యర్థాలతో రూపొందించిన చేతి ఉత్పత్తుల శిక్షణ, ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పురుషుల సంపాదన ఒక్కటే కుటుంబానికి సరిపోదని, మహిళలూ ఆదాయం వచ్చే పనులు చేయాల్సిన అవసరం ఉందన్నా రు. వారికి చేదోడుగా నిలిచి ఆర్థికంగా అభివృద్ధి చేయడ మే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి జిల్లాలో వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.30కోట్లతో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు. అలాగే నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని మహిళలందరికీ ప్రత్యేకించి స్వయం సహాయక మహిళలకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణ ఇస్తామన్నారు. తనతో పాటు, ప్రభుత్వపరంగా, అలాగే దాతల సహకారంతో మహిళల కు ఆదాయాన్నిచ్చే కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథ కం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 17కోట్ల మంది దీన్ని వినియోగించుకున్నారన్నారు. రెండు నెలల్లో గృహలక్ష్మి పథకం అమలులోకి రానుందని, మరో 10, 15 రోజుల్లో రూ.500లకే ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్ల పథకం తీసుకురానున్నమని తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలతో టీకప్పులు తయారుచేసే యంత్రానికి అవసరమైన రూ.15లక్షలను తన సొంత నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ, మహిళలు స్వయంగా ఆర్థికంగా బలపడాలన్నారు. జిల్లాలో మహిళా స్వయం సహాయక బృందాల కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నామని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవస రం ఉందన్నారు. ఒక్కొక్కరుగా కాకుండా గ్రూపుగా నిర్వహించాలన్నారు.

మహిళలు చేపట్టే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యంతోపాటు, బైబ్యాక్‌ విధానంలో విక్రయించేందుకు చా లా విధానాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో నిమ్మ, మిల్లెట్స్‌లాంటి వాటిపై ఎక్కువ ఉత్పత్తులు చేపడితే వాటికి మంచి మార్కెట్‌ ఉందని తెలిపారు. టీటీడీసీలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వివిధ వ్యర్థాలతో మహిళలు తయారుచేసిన సుమారు 20రకాల వస్తువులు ప్రదర్శించారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవో రవి పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:46 AM