Share News

ప్రభుత్వ ఐటీఐల్లో ఉపాధి కోర్సులు

ABN , Publish Date - May 27 , 2024 | 12:38 AM

పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పారిశ్రామి క శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఉపాది ఆధారిత పారిశ్రామిక శిక్షణ కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.

 ప్రభుత్వ ఐటీఐల్లో ఉపాధి కోర్సులు

పారిశ్రామికీకరణే లక్ష్యంగా ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు

టాటా టెక్నాలజీస్‌ భాగస్వామిగా..

ఉమ్మడి జిల్లాలో ఆరింటిలో..

ఈ విద్యాసంవత్సరంనుంచే 6నూతన కోర్సులు

1440 సీట్లు అందుబాటులోకి

భువనగిరి టౌన్‌, 24 మే: పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పారిశ్రామి క శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఉపాది ఆధారిత పారిశ్రామిక శిక్షణ కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు పేరిట టాటా టెక్నాలజీ్‌సతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సుల ప్రారంభానికి అవసరమైన భవనాల నిర్మాణం, ఆధునిక శిక్షణ సామగ్రికి, శిక్షణకు రూ.2వేల కోట్లను టాటా టెక్నాలజీస్‌ వెచ్చించనుంది. ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే ఒప్పంద లక్ష్యంగా ఉంది. ఈ మేర కు ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సుల మౌలిక వసతుల కల్పనకు ఈ పాటికే మూడు దఫాల సర్వేలు పూర్తికాగా ఎన్నికల కోడ్‌ ముగిసిసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో నూతన కోర్సుల్లో చేరే విద్యార్థులకు గ్యారంటీగా ఉపాధి ఉద్యోగాలు లభించనున్నాయి.

మారనున్న ప్రభుత్వ ఐటీఐల దశ

ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టుతో ప్రభుత్వ ఐటీఐల దశ మారడంతోపాటు నూతన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశా లు మెరుగు కానున్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులు యథావిధిగా ఉండనుండగా నూతనంగా ఆరు కోర్సులు అం దుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితర సంప్రదాయ కోర్సులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి పారిశ్రామిక రంగ పరిస్థితులకు దశాబ్దాల క్రితం రూ పొందించిన అప్పటి కోర్సులు నేటి ఆధునిక పారిశ్రామిక రంగానికి అ నుగుణంగా స్కిల్‌ వర్కర్స్‌ లభించకపోతుండటంతో పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారుతుండటంతోపాటు యువతకు ఉద్యోగ ఉపా ధి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులను ఆధునికీకరించే లక్ష్యంలో భాగంగా ప్రస్తుత పారిశ్రామికీకరణకు అనుగుణంగా రూపొందించిన ఆరు నూతన కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్ర భుత్వ ఐటీఐల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుత కోర్సులకు ఈ పాటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా నూతన కోర్సులకు త్వరలో అడ్మీషన్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది. విద్యా అర్హతలు, ఉపకారవేతనాలు తదితర నిబంధనలు యథావిధిగా ఉండనున్నాయి.

ఆరు నూతన కోర్సులు.. ప్రతి కోర్సులో 40 సీట్లు

ఒకటి, రెండు సంవత్సరాల నిడివితో ఆరు నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ కోర్సులో 40 సీట్లు ఉంటాయి. నూతన కోర్సులకు అనుగుణంగా ప్రతీ ఐటీఐకి నూతన ఇన్‌స్ట్రక్టర్స్‌ను నియమించనుండగా ప్రస్తుత ఇన్‌స్ట్రక్టర్స్‌ అందరికీ టాటా టెక్నాలజీస్‌ శిక్షణ ఇవ్వనుంది. నూతన కోర్సులు ఇలా......

రెండు సంవత్సరాల కోర్సులు

1) బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌(మెకానికల్‌)

2) అడ్వాన్స్‌డ్‌ ిసీఎన్‌సీ మిషినింగ్‌ టెక్నీషియన్‌

3) మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

ఏడాది కోర్సులు

4) మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌

5) ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌

6) ఆర్టీసన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌

ఉమ్మడి జిల్లాలో ఇలా....

ఉమ్మడి జిల్లాలో ఆరు ప్రభుత్వ, 23ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో సుమారు 11, 361 మంది విద్యార్థులు పలు కోర్సులు చేస్తున్నారు. అయితే యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వ ఐటీఐలు ఉండగా సూర్యాపేట జిల్లా విద్యార్థులకు మాత్రం ప్రైవేటు ఐటీఐలే అందుబాటులో ఉన్నాయి. దీంతో యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని ప్రభుత్వ ఐటీఐల్లో మాత్రమే నూతన ఆరు కోర్సులు, 1440సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.

జిల్లా ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు

నల్లగొండ 4 10 5,748

యాదాద్రి 2 8 4,563

సూర్యాపేట - 5 1,050

మొత్తం 6 23 11,361

నూతన కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు : హరికృష్ణ, కన్వీనర్‌ యాదాద్రిభువనగిరి జిల్లా ఐటీఐలు

నూతన కోర్సులు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ను కల్పిస్తాయి. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా టాటా ఇండస్ట్రీస్‌ భాగస్వామిగా రూపొందించిన ఆరు కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ ఐటీఐల్లో అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి లక్ష్యంగా తీర్చిదిద్దిన నూత న కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నూతన కోర్సులకోసం ఐటీఐల్లో ప్రతిపాదించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Updated Date - May 27 , 2024 | 12:38 AM