Share News

విద్యుత సమస్యను పరిష్కరించాలి: సీపీఎం

ABN , Publish Date - May 29 , 2024 | 12:12 AM

మండలంలోని అనాజీపురం గ్రామంలో విద్యుత లో వోల్టేజీ, వేలాడుతున్న విద్యుత తీగలతో విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీపీఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు ఎదునూరి మల్లేశం, అబ్దుల్లాపూర్‌ వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

  విద్యుత సమస్యను పరిష్కరించాలి: సీపీఎం
ట్రాన్సకో డీఈ మల్లిఖార్జునకు వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

భువనగిరి రూరల్‌ మే 28: మండలంలోని అనాజీపురం గ్రామంలో విద్యుత లో వోల్టేజీ, వేలాడుతున్న విద్యుత తీగలతో విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీపీఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు ఎదునూరి మల్లేశం, అబ్దుల్లాపూర్‌ వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రాన్సకో డీఈ బి.మల్లిఖార్జునగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. చిన్నపాటి వర్షానికి, ఈదురుగాలులకు వెంటనే విద్యుత సరఫరా నిలిచిపోతోందని, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని, లోవోల్టేజీతో విద్యుత ఉపకరణాలైన టీవీలు, ఫ్రిజ్‌లు, లైట్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. విద్యుత సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Updated Date - May 29 , 2024 | 12:12 AM