Share News

ఎన్నికల నియమావళిని పటిష్ఠంగా అమలుచేయాలి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:09 AM

ఎన్నికల నియమావళిని తెలుగు రాష్ర్టాలు సమన్వయంతో పటిష్ఠంగా అమలుచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావులు అన్నారు.

ఎన్నికల నియమావళిని పటిష్ఠంగా అమలుచేయాలి
సమావేశంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల కలెక్టర్లు, పోలీసు అధికారులు

కోదాడ రూరల్‌, మార్చి 26 : ఎన్నికల నియమావళిని తెలుగు రాష్ర్టాలు సమన్వయంతో పటిష్ఠంగా అమలుచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావులు అన్నారు. మంగళవారం ఇరు రాష్ర్టాల పోలీస్‌, రెవెన్యూ అధికారులతో ఎన్నికల నియమావళిపై ఆంధ్రప్రదేశలోని జగ్గయ్యపేట దగ్గరలోని రాంకో సిమెంట్‌ ఫ్యాక్టరీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు జిల్లాల కలెక్టర్లతో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే, ఎన్టీఆర్‌ రూరల్‌ జిల్లా డీసీపీ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రాష్ర్టాల సరిహద్దుగా ఉన్న కోదాడ, జగ్గయ్యపేట మండలాల్లోని ఇరు రాష్ర్టాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు పర్చేందుకు కృషి చేయాలన్నారు. నగదు తరలింపు, మద్యం తరలింపు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, పలు సమస్యలపై ఇరు రాష్ర్టాల సరిహద్దు అధికారులు నిఘా ఉంచి అప్రమత్తంగా పనిచేయాలని, ఎన్నికల నియమావళిని పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో నందిగామ ఏసీపీ రవికిరణ్‌, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐలు రాము, రజితారెడ్డి, సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు, జగ్గయ్యపేట సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:09 AM