Share News

ఎన్నికల నాటి హామీలను అమలు చేయాలి

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:46 AM

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశా రు. చౌటుప్పల్‌ పట్టణంలో బుధవారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

ఎన్నికల నాటి హామీలను అమలు చేయాలి

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

చౌటుప్పల్‌ టౌన్‌,జూన్‌ 26: ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశా రు. చౌటుప్పల్‌ పట్టణంలో బుధవారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మూడింటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం హర్షనీయమని, మిగిలిన మూడింటిని కూడా త్వరలో అమలుచేసి పేదవర్గాల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదవర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కొత్తగా రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేయలేదన్నా రు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కూడా ఇవ్వలేక పోయిందని, దీంతో పేద కుటుంబాలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు, పేదవర్గా ల సమస్యలపై నిరంతరం పోరాటాలను సాగిస్తున్నామని, మ హిళలు ఐక్య ఉద్యమాలతోనే సమస్యలను సాధించుకోవాలన్నా రు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారీ రామేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి బి.అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు దోనూరు నిర్మల, జిల్లా కోశాధికారి కల్లూరి నాగమ ణి, కమిటీ సభ్యులు జయమ్మ, అండాలు, లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:46 AM