చేనేత పరిరక్షణకు కృషి
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:29 AM
ప్రింటెడ్ చేనేత చీరలతో పరిశ్రమను దెబ్బతీసే విధంగా కార్పోరేట్ సంస్థలు రూపొందిస్తున్న ప్రింటెడ్ డిజైన చీరలను అరికట్టి, చేనేత టైఅండ్‌డై పరిశ్రమ పరిరక్షణకు చేయూతనిస్తానని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఎనఫోర్స్‌మెంట్ అధికారి, రీజినల్ డిప్యుటీ డైరెక్టర్ వెంకటేశం అన్నారు.

భూదానపోచంపల్లి, జూన 26 : ప్రింటెడ్ చేనేత చీరలతో పరిశ్రమను దెబ్బతీసే విధంగా కార్పోరేట్ సంస్థలు రూపొందిస్తున్న ప్రింటెడ్ డిజైన చీరలను అరికట్టి, చేనేత టైఅండ్‌డై పరిశ్రమ పరిరక్షణకు చేయూతనిస్తానని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఎనఫోర్స్‌మెంట్ అధికారి, రీజినల్ డిప్యుటీ డైరెక్టర్ వెంకటేశం అన్నారు. బుధవారం ఆయన భూదానపోచంపల్లి పట్టణంలోని పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన ఆధ్వర్యంలో రజతోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. చేనేతకు రిజర్వ్ చేసిన రిజర్వేషన్లను, పోచంపల్లి ఇక్కత డిజైన్లను ప్రింట్ చేసిన నకిలీ చీరలతో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. చేనేత పరిశ్రమ మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యాపారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేట్ ఆనలైనలో చేనేత ఉత్పత్తుల నకిలీలు ప్రింటెడ్ చీరలపై ఎన్నో కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా చేనేత,జౌళీ శాఖ ఏడీ విద్యాసాగర్, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన అధ్యక్షుడు భారత లవకుమార్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గంజి యుగేందర్, సిల్కు యారన అసోసియేషన అధ్యక్షుడు సూరపల్లి రవీందర్, చేనేత నాయకులు కర్నాటి బాలరాజు, ముస్కూరి నర్సింహ, ఈపూరి ముత్యాలు, మంగళపల్లి రమేష్, వనం దశరథ, సీత సుధాకర్, కందగట్ల శంకరయ్య, సీత కృష్ణ, నామాల శ్రీనివాస్, రచ్చ భాస్కర్, వేముల నరేష్ పాల్గొన్నారు.