Share News

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:51 AM

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండి.జహంగీర్‌ అన్నారు.

  జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
రామన్నపేటలో ప్రచారంలో పాల్గొన్న సీపీఎం నాయకులు జహంగీర్‌, అశోక్‌రెడ్డి తదితరులు

సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్‌

రామన్నపేట, ఏప్రిల్‌ 15: జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండి.జహంగీర్‌ అన్నారు. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ కొంత కాలంగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న రామన్నపేటను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. పాత నియోజకవర్గంగా ఉన్న రామన్నపేట నుంచి బలమైన ప్రజా ప్రతినిధులు లేక ప్రాంతం వెనకబడి.. పాలకుల నిర్లక్ష్యానికి గురైందన్నారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలు దశాబ్దాలు దాటుతున్నా.. పాలకులు మారుతున్నా పూర్తి కావడంలేదన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా అవకాశం ఇస్తే రామన్నపేట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి డివైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు జల్లల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకలు వనం ఉపేందర్‌, గాదె నరేందర్‌, బోయినొ ఆనంద్‌, వైస్‌ యంపీపీ నాగటి ఉపేందర్‌, మామిడి వెంకట్‌రెడ్డి, కందుల హనుమంతు, గొరిగె సోములు, బావండ్లపల్లి బారాజు, రషీద్‌ పాల్గొన్నారు.

వలిగొండ: నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను ఎంపీగా గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి అయిలయ్య ప్రజలను కోరారు. మండలంలోని పొద్దటూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌ పరిధిలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా నేటికీ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడే సీపీఎం అభ్యర్థిని గెలిపించాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కాలుష్య సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని మూసీ జల కాలుష్యాన్ని అరికట్టాలని మూసీ పరివాహక ప్రాంతంలో గోదావరి జలాలలను అందించాలని డిమాండ్‌ చేస్తూ గతంలో సీపీఎం పార్టీ ఆఽధ్వర్యంలో ఉద్యమాలు చేశామన్నారు. కార్యాక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామి, మండల కమిటీ సభ్యులు ఎలె కృష్ణ, నాయకులు లింగం, బాలయ్య, స్వామి, కాంతయ్య పాల్గొన్నారు.

సంస్థాననారాయణపురం: సంస్థాన నారాయణపురం మండలంఅల్లందేవిచెర్వు గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకంలో పనిచేచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న సీపీఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, నాయకులు జనిగల నరసింహ, గంగాదేవి భిక్షం, గుండు దశరథ, గుండు లింగస్వామి, గుండు జంగయ్య, గుండు జయమ్మ, జనిగలయాదయ్య, ఉప్పలపెళ్లి భారతమ్మ, గుండు మంగమ్మ, జంగమ్మ, సాలయ్య, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:51 AM