Share News

తెలంగాణలో విద్యా సంక్షోభం

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:31 AM

ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో విద్యా సంక్షోభం నెలకొన్నదని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌.మూర్తి అన్నారు.

తెలంగాణలో విద్యా సంక్షోభం
ఎస్‌ఎ్‌ఫఐ సైకిల్‌ యాత్రను ప్రారంభిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, మల్లేషం

ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి

భువనగిరి టౌన, ఆగస్టు 23: ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో విద్యా సంక్షోభం నెలకొన్నదని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌.మూర్తి అన్నారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ, సంక్షేమ హాస్టల్స్‌ సంరక్షణ లక్ష్యంగా ఎస్‌ఎ్‌ఫఐ చేపట్టిన సమరభేరి సైకిల్‌ యాత్రను శుక్రవారం భువనగిరిలోని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. నాటి బీఆర్‌ఎస్‌ నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. సమస్యలకు కేరా్‌ఫగా ప్రభుత్వ హాస్టల్స్‌ మారాయన్నారు. కాస్మోటిక్స్‌ చార్జీలను పెంచాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. శిథిలా భవనాలలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. మరికొన్ని ఇరుకు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రం భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు, మాజీ కార్యదర్శి వనం రాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:31 AM