Share News

రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:13 AM

రాష్ట్రంలో కరువు వచ్చిందే కేసీఆర్‌ చేసిన పాపాల వల్లేనని, శవరాజకీయాలతో రైతుల జీవితాలతో ఆడుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మంత్రి కోమటిరెడ్డి
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సూర్యాపేట రూరల్‌, ఏప్రిల్‌ 7 : రాష్ట్రంలో కరువు వచ్చిందే కేసీఆర్‌ చేసిన పాపాల వల్లేనని, శవరాజకీయాలతో రైతుల జీవితాలతో ఆడుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం అర్వపల్లి మండలం అడివెంల గ్రామంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరై తిరుగు ప్రయాణంలో రాయినిగూడెం సమీపంలోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో ఫాంహౌ్‌సకే పరిమితమైన కేసీఆర్‌ ఇప్పుడు పొలంబాట పేరుతో బయటకు వచ్చి రైతులకు మాయమాటలు చెప్పి రైతులను అమోమయంలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో 14 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని, రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాదన్నారు. బిడ్డ జైలుకు పోయి ట్యాపింగ్‌ కేసులు బయటకురావడంతో కుటుంబమంతా ఎక్కడ జైలుకు పోతారన్న భయంతో ప్రజలను డైవర్ట్‌ చేయటానికే పొలంబాట అంటూ మొదలుపెట్టారని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ఇల్లు కట్టలేదని, రేషనకార్డు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఆరు వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో 30 వేల పోస్టులతో డీఎస్సీ నోటిపికేషనతో పాటు గ్రూప్‌-1 ప్రకటించామని తెలిపారు. రైతులు అప్పులపాలై చనిపోయారన్నది అవాస్తవమన్నారు. పంట ఎండిపోయిన వాటి లెక్కలు తీసి రైతులకు నష్ట పరిహారం అందిస్తామన్నారు. రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంతరెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు విషయంలో రూ.7వేల కోట్లకు కేసీఆర్‌ కమీషన్లు తీసుకున్నాడని, తెలంగాణ రూపురేఖలు మార్చేలా ఔటర్‌ రింగ్‌రోడ్డు సమాంతరంగా రూ.30 వేల కోట్లతో రీజనల్‌ రింగురోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన టెండర్లు త్వరలో పిలుస్తామన్నారు. ఇసుక విక్రయించగా వచ్చిన సొమ్ముతో మూడు వేల ఓట్లతో జగదీ్‌షరెడ్డి గెలిచాడని, అది గెలుపే కాదన్నారు. రూ.2వేల కోట్లు ఖర్చుపెడితే ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యేదని, ఎంత కరువు వచ్చినా రైతులకు నీళ్లు ఉండేవన్నారు. కేసీఆర్‌ దక్షిణతెలంగాణలోని ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వలేదో, డిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్‌ చెప్పాలన్నారు. కేసీఆర్‌ వివక్ష గుర్తించే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థులను 40, 50 వేల మెజార్టీతో గెలిపించారన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:13 AM