Share News

నిఘా నేత్రాలపై పట్టింపేదీ?

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:04 AM

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం. ఒక సీసీ కెమెరా వంద మం ది పోలీసులతో సమానమని అంటారు.

నిఘా నేత్రాలపై పట్టింపేదీ?

పనిచేయని సీసీ కెమెరాలు..

దాతల విరాళాలతో 64సీసీ కెమెరాల ఏర్పాటు..

వినియోగంలోకి తీసుకురావాలంటున్న స్థానికులు

మోటకొండూర్‌, ఏప్రిల్‌ 16: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం. ఒక సీసీ కెమెరా వంద మం ది పోలీసులతో సమానమని అంటారు. మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని, అందులో ప్రజల భాగస్వా మ్యం ఉండాలని పోలీసు ఆధికారులు గ్రామాల్లో, సభలు సమావేశాల ద్వారా ప్రోత్సహిస్తుంటారు. నూతన విధానం తో నేరాలపై నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ కెమెరా లు దోహదపడతాయి. అయితే మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో దాతల సహకారం తో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ కోద్ది రోజులు మాత్రమే సక్రమంగా పనిచేశాయి. వీటి నిర్వహణపై పోలీసు వ్యవస్థ శ్రద్ధ చూపకపోవడంతో సీసీ కెమెరాలు ఒక్కొక్కటిగా మూలకు పడ్డాయి. కొన్ని సీసీ కెమెరాలు కనబడకుండా పోయా యి. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం మొదలుకుని ముఖ్యమైన సెంటర్ల వద్ద కెమెరాలు పని చేయడంలేదు. మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీల్లో 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందులో 29 మాత్రమే పనిచేస్తున్నాయి. కా నీ పనిచేయని కెమెరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొద్ది రోజుగా జిల్లా వ్యాప్తంగా పిల్లలను అపహరించుకుపోయే ముఠా సభ్యలు సంచారిస్తున్నరన్న వదంతులు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈలాంటి ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పాత్ర కీలమైనదిగా చెప్పొచ్చు.

దాతల సహకారంతో..

మండలంలోని గ్రామాల్లో సర్పంచలు, ఎంపీటీసీలు, దాతలు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సహకారంతో గత ఎస్‌ఐలు వెంక న్న, నాగరాజు అధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి మరమ్మతుల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంతోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వినియోగంలోకి తీసుకురావాలి

గ్రామాల్లో వరుస చోరీలు, యువత అసాంఘిక కార్యకలాపాల నియాంత్రణకు గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను ఎప్పటికప్పు డు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలి. ప్రధాన కూడళ్లలో జరిగే పలు ఘటనలపై పోలీసులు పట్టు సాధించవచ్చు. దొంగతనాలు, అపరిచిత వ్యక్తులను త్వరగా గుర్తించవచ్చు.

- బుగ్గ కొమురయ్య, గ్రామస్థుడు, మోటకొండూర్‌

సీసీ కెమెరాలను అందుబాటులోకి తెస్తాం

మండలంలో ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాతలు, గ్రామస్థులు, వ్యాపారుల సహకరంతో మం డల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తు న్నాం. కొన్ని గ్రామాల్లో కోతుల నిర్వాకం వల్ల సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించి అందుబాటులోకి తిసుకువస్తాం.

- తేజంరెడ్డి, ఎస్‌ఐ, మోటకొండూర్‌

Updated Date - Apr 17 , 2024 | 12:04 AM