Share News

అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:01 AM

అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పవద్దని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను తీసుకుని, మాట్లాడారు.

అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దు
నూతన చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సూర్యాపేట క్రైం, జూన 10 : అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పవద్దని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను తీసుకుని, మాట్లాడారు. కొంతమంది తెలియని వ్యక్తులు ఆనలైనలో మీకు బహుమతులు వచ్చాయని, బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఏటీఎం పిన నెంబరు, ఆధార్‌ కార్డు వివరాలు అడిగి మోసగిస్తారని వివరించారు. బ్యాంకు అధికారులు ఎవరు కూడా, ఎప్పుడు కూడా ఫోనలో బ్యాంకు ఖాతా వివరాలు అడగరని, దానిని గమనించాలన్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు సంచరించినా వెంటనే డయల్‌-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

నూతనచట్టాలపై ప్రతీ పౌరుడు, పోలీస్‌ అధికారి అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావుతో కలిసి నూతన చట్టాలపై పోలీస్‌ సిబ్బందికి ఏర్పాటుచేసిన శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే బాధితులకు న్యాయం సాధ్యమవుతుందన్నారు. చట్టాలను అమలు చేయాలంటే ప్రతీ అంశంపై ఖచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. అప్పుడే విధి నిర్వహణలో ప్రతిభ చూపే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ హైకోర్టు న్యాయవాది, సెంట్రల్‌ డిటెక్టివ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీ అధ్యాపకుడు డాక్టర్‌ సాంబమూర్తి నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.

Updated Date - Jun 11 , 2024 | 12:01 AM