శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:23 AM
శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పోలీసులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషన్‌ను ఆయన తనిఖీచేశారు. పోలీ్‌సస్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్ల వివరాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నార్కట్‌పల్లి, జూలై 4: శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పోలీసులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషన్‌ను ఆయన తనిఖీచేశారు. పోలీ్‌సస్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్ల వివరాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధ్యుల విషయంలో కఠినంగా, బాధితుల విషయంలో ఫ్రెండ్లీగా వ్యవహరించాలన్నారు. తద్వారా నేరాలను అదుపులోకి తీసుకురావడంతో పాటు పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. కాగా, తొలిసారి వచ్చిన ఎస్పీకి ఎస్‌ఐ అంతిరెడ్డి, కానిస్టేబుళ్లు గౌరవ వందనం సమర్పించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాలకు నివారణకు చర్యలు
చిట్యాల: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. గురువారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌ను తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రైల్వేస్టేషన్ వద్ద జంక్షన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనదారులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 100కు వచ్చిన కాల్స్‌పై పోలీసులు వెంటనే స్పందించాలన్నారు. జాతీయ రహదారి మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిపై నిఘా పెంచాలన్నారు. అందుకు పకడ్బందీగా వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ కొనసాగించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ నాగరాజు, ఎస్‌ఐ సైదాబాబు ఉన్నారు.
కేతేపల్లి: ఎస్పీ శరత్‌చంద్ర పవార్ గురువారం కేతేపల్లి, నకిరేకల్ పోలీ్‌సస్టేషన్లను తనిఖీ చేశారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లు, పోలీ్‌సస్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు, మండలంలో నమోదైన నేరాల సంఖ్య తదితర వివరాలను ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. హైవేపై ఎన్ని సీసీ కెమెరాలు, ఉన్నాయి. అందులో ఎన్ని పనిచేస్తున్నాయనే వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, కేసుల పరిష్కారంలో జాప్యం చేయకుండా తక్షణం స్పందించాలన్నారు. పలు కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట సీఐలు శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్, ఎస్‌ఐలు ఎ.శివతేజగౌడ్, గోపికృష్ణ, సుధీర్‌కుమార్, తదితరులు ఉన్నారు.