Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:30 AM

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో కలిసి గురువారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని క్రైస్తవుల శ్మశానవాటిక పనులను పరిశీలించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
హుజూర్‌నగర్‌ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పక్కన కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

మునిసిపల్‌ స్థలాలు ఆక్రమిస్తే కఠినచర్యలు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీల్లో సమీక్షలు

హుజూర్‌నగర్‌, జులై 4 : అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో కలిసి గురువారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని క్రైస్తవుల శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో టీయూఎ్‌ఫడీసీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ పట్టణంలో రూ.25 కోట్ల పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. మునిసిపల్‌ స్థలాలపై కోర్టుకు వెళ్లిన సంఘటనలపై కలెక్టర్‌ చొరవ తీసుకోవాలన్నారు. గతంలో మునిసిపల్‌ కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా లేఅవుట్‌ స్థలాలకు నెంబర్లు కేటాయించిన సంఘటనపై విచారణ చేయాలని ఆదేశించారు. లేఅవుట్‌ స్థలాలను కాపాడాలన్నారు. మెయినరోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్లు కేటాయించవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అధికారులను ఇంటికి పంపిస్తానన్నారు. పట్టణంలో మినీస్టేడియం, ఏటీసీ కళాశాల నిర్మాణానికి స్థలం ఎంపికకు ఆర్డీవో కమిషనర్‌, తహసీల్దార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన, వైస్‌చైర్మన్లతో కమిటీ వేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రెండురోజుల్లో స్థలం ఖరారు చేయాలన్నారు. సాయిబాబా థియేటర్‌ వద్ద 5,500 గజాల లేఅవుట్‌ స్థలానికి కంచె వేయాలన్నారు. ఫణిగిరి గట్టు వద్ద మోడల్‌ కాలనీ పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. రూ.2కోట్లతో గోవిందాపురం బ్రిడ్జి నిర్మించాలన్నారు. రూ.3కోట్లతో హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేయాలన్నారు. లింగగిరి రోడ్డు, మట్టపల్లి బైపాస్‌ జంక్షన్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : కలెక్టర్‌

ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ కోరారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో పారిశుధ్యం మెరుగుదలకు సహకారం అందించాలన్నారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి సూచించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన సంపత్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, యరగాని నాగన్నగౌడ్‌, గెల్లి రవి, వీరారెడ్డి, అజీజ్‌పాషా, కుందూరు శ్రీనివా స్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌ గౌడ్‌, డీఈ రమేష్‌, ఎన్‌ఎ్‌సపీ ఈఈ శ్రీనివాసు, డీఈ బిక్షం, ఏఈ శ్రీనివా్‌స,కౌన్సిలర్లు కస్తాల శ్రావణ్‌, ఓరుగంటి నాగేశ్వరరావు, ఫణి, శంభయ్య, మంజుల, రామ్‌గోపి, సౌజన్య, సరిత, వరలక్ష్మి పాల్గొన్నారు.

కోదాడను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా

కోదాడ: కోదాడను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతామన్నారు. పట్టణంలోని మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధికి రూ.8 కోట్లు మంజూరు చేశామని, వెంటనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్‌కి పనులు అప్పగించాలన్నారు. పట్టణంలోని సమస్యలపై కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కోదాడలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులపై సమీక్షించారు. రూ.6 కోట్లతో టౌనహాల్‌ నిర్మాణం, రూ.50లక్షలతో ఖమ్మం ఎక్స్‌రోడ్డు జంక్షన అభివృద్ధి, రూ.1.1కోట్లతో ముఖద్వారాలు, రూ.4.4 కోట్లతో చెరుకుకట్ట బజార్‌ నుంచి అనంతగిరి రోడ్డు వరకు మేజర్‌ ఔట్‌పాల్‌ మురుగుకాల్వ నిర్మాణం, అదనపు అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య సిబ్బంది, కోదాడలో ముస్లిం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంపై కౌన్సిలర్లు, మునిసిపల్‌ అధికారులు, ఇంజనీర్లతో కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం ముస్లిం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ రమాదేవి, చైర్‌పర్సన సామినేని ప్రమీల, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఈఈ ప్రసాద్‌, కౌన్సిలర్లు, ఆర్డీవో సూర్యానారాయణ, తహసీల్దార్‌, ఎంపీడీవో, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:30 AM