Share News

ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:28 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ధన, కుల బలంతో కల్లబొల్లి హామీలతో ఓటర్లను మభ్యపెడుతూ తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ అన్నారు.

 ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌

భువనగిరి రూరల్‌, మార్చి 23: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ధన, కుల బలంతో కల్లబొల్లి హామీలతో ఓటర్లను మభ్యపెడుతూ తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ అన్నారు. టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాసిస్ట్‌ నరేంద్రమోదీని ఓడించి రాజ్యాంగాన్ని ప్రజా స్వామ్య విలువలను పరిరక్షించాలన్నారు. ప్రజా సం ఘాల ప్రతినిధులు భట్టు రాంచంద్రయ్య, రాచకొండ జనార్ధన, ఉప్పలయ్య, సుదర్శననాయర్‌, కాశపాక మహేష్‌ మాట్లాడుతూ మతోన్మాధ బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తుందన్నారు. గుజరాత మరణ కాండ శవాల గుట్టలపై 2014లో అధికారం చేజిక్కించుకున్న మోదీ ముచ్చటగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతూ అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల విధానాలను ఎండ గట్టి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న కమ్యూనిస్టులకు పట్టం కట్టాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు అమిద్‌ పాషా, కట్టెల లింగస్వామి, అస్గర్‌ అలీ, మల్లారెడ్డి, ఎం సత్తయ్య, బోయ నర్సింహ, కావలి యాదయ్య, రాసాల బాలస్వామి, జి.బాలకృష్ణ సత్తయ్య ఉన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:29 AM