హద్దులు దాటుతున్న రేషన్ డీలర్లు
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:07 AM
రేషన్ బియ్యం అక్ర మ దందా జోరుగా సాగుతోంది. హుజూర్‌నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రేషన్ బియ్యం యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ షాపుల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం గోదాంల నుంచే ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. హుజూర్‌నగర్ పట్టణంలోని పౌరసరఫరాలశాఖకు చెందిన గోదాం నుంచి 42 టన్నుల బియ్యం మాయమయ్యాయి.

హుజూర్‌నగర్ గోదాం నుంచి 42 టన్నుల బియ్యం మాయం
ఏపీ రాష్ట్రానికి బియ్యం సరఫరా
గోదాం ఇన్‌చార్జిని సస్పెండ్ చేసిన అదనపు కలెక్టర్
హుజూర్‌నగర్, జూలై 7: రేషన్ బియ్యం అక్ర మ దందా జోరుగా సాగుతోంది. హుజూర్‌నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రేషన్ బియ్యం యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ షాపుల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం గోదాంల నుంచే ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. హుజూర్‌నగర్ పట్టణంలోని పౌరసరఫరాలశాఖకు చెందిన గోదాం నుంచి 42 టన్నుల బియ్యం మాయమయ్యాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు ఈ నెల 6న గోదాంను తనిఖీచేసి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన సుమా రు 22టన్నుల రేషన్ బియ్యాన్ని నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద అధికారులు పట్టుకోవడంతో ఈ దం దా బట్టబయలైంది. పట్టణంలో పౌరసరఫరాలశాఖకు చెందిన రెండు గోదాంలు ఉన్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న పాత గోదాం, మార్కెట్‌యార్డ్‌లో ని మరో గోదాంల నుంచి బియ్యం సరఫరా చేస్తు న్న అధికారులు అక్రమాలకు ఇక్కడి నుంచే తెరలేపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హుజూర్‌నగర్ స్టాక్ పాయింట్ నుంచి మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాలకు ప్రతీ నెల బియ్యం సరఫరా అవుతున్నాయి. జూన్ 27 నుంచి ఈ నెల చివరి వరకు బి య్యం సరఫరా చేయాల్సి ఉండగా, అధికారుల నిర్ల క్ష్యం కారణంగా గోదాం నుంచి సక్రమంగా బియ్యం సరఫరా కాలేదు. నియోజకవర్గంలో 188 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతీ నెల 11,654 టన్నుల రేష న్ బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. నియోజకవర్గంలో 92,983రేషన్‌కార్డులు ఉండగా, 2,55,758 యూనిట్లు ఉన్నాయి. గోదాం నుంచి ప్రతీ డీలర్‌కు జీపీఎస్ విధానం ఉన్న లారీల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా, మూడురోజుల క్రితం వాడపల్లి వద్ద రేషన్ బియ్యం పట్టుకోగా, బియ్యం బస్తాలు కూడా మార్చకుండా సరాసరి హుజూర్‌నగర్ నుంచి ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు అక్రంగా తరలిస్తున్నారు. వాస్తవంగా రేషన్ బియ్యాన్ని కాంట్రాక్టర్‌కు సంబంధించిన లారీల ద్వారానే డీలర్లకు అందించాల్సి ఉంది. కానీ, జీపీఎస్ లేని, కాంట్రాక్టర్‌కు సంబంధంలేని లారీకి రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి ఏపీకి తరలిస్తుండడం గమనార్హం. అయితే మొత్తం 42 టన్నుల బియ్యం మాయం కాగా, వాడపల్లి వద్ద 22 టన్నులు మాత్రమే పట్టుబడ్డాయి. మిగిలిన 20 టన్నుల బియ్యం ఎక్కడ మాయమయ్యాయో తేలాల్సి ఉంది. వాడపల్లి వద్ద దొరికిన రేషన్ బియ్యం నేరేడుచర్ల మండలానికి కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. అధికారుల ఆండదండలతోనే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం.
గోదాం ఇన్‌చార్జి సస్పెన్షన్
హుజూర్‌నగర్ సివిల్‌సప్లయ్ గోదాం నుంచి 42టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైన ఘటన లోగోదాం ఇన్‌చార్జిన అదనపు కలెక్టర్ లత స స్పెండ్ చేశారు. ఈ నెల 6న గోదాంను పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాములు, ఏఎ్‌సవో పుల్లయ్య, డీటీసీఎస్ రాజశేఖర్ తనిఖీచేశారు. బి య్యం నిల్వలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఈగోదాంకు నభీఇన్‌చార్జిగా ఉన్నారు. రేషన్ బి య్యం పక్కదారి పట్టినట్టు గుర్తించిన అధికారు లు సమగ్ర నివేదికను అదనపు కలెక్టర్‌కు అందజేశారు. అధికారుల నివేదిక ఆధారంగా అదనపు కలెక్టర్ లత గోదాం ఇన్‌చార్జి నభీని సస్పెండ్ చేశారు. వాడపల్లి వద్ద దొరికి బియ్యంతో పాటు మిగిలిన బియ్యం మాయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించినట్టు తెలిసింది. రేషన్ షాపులకు బియ్యం సరఫరా చే సేలారీలకు బదులుగా వేరేలారీల ద్వారా బియ్యా న్ని తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని కొంతమంది డీ లర్లు బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీచేయకుం డా ఏపీ రాష్ట్రానికి తరలిస్తున్నట్టు సమాచారం.
డీఎం పర్యవేక్షణలో డీలర్లకు రేషన్ బియ్యం సరఫరా
పౌరసరఫరాలశాఖ డీఎం రాములు, డీటీ సీఎస్ రాజశేఖర్ పర్యవేక్షణలో ఆదివారం నియోజకవర్గంలోని రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేశారు. గోదాం ఇన్‌చార్జిని సస్పెండ్ చేయడంతో డీఎం దగ్గరుండి డీలర్లకు బియ్యం పంపిణీ చేయించారు.