Share News

నిరుద్యోగ యువతకు బాసటగా నిరంతర కృషి

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:16 AM

నకిరేకల్‌ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

నిరుద్యోగ యువతకు బాసటగా నిరంతర కృషి
మెగాజాబ్‌మేళాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్‌, ఫిబ్రవరి 25 : నకిరేకల్‌ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో 65కంపెనీలతో నిర్వహించిన మెగాజాబ్‌మేళాను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతీ పేద విద్యార్థికి అండగా ఉండటమే లక్ష్యమన్నారు. జాబ్‌మేళా ద్యారా విద్యార్థ బంగారు భవిష్యతకు అండగా ఉండటమే తమ లక్ష్యమన్నారు. ప్రతీ పేద విద్యార్థి కలలను నెరవేర్చడంలో తాను తోడ్పాటుగా ఉంటానన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, బీసీ ఫైనాన్స కార్పొరేషన మాజీ చైర్మన పూజార్ల శంభయ్య, టీపీసీసీ మెనిఫెస్టో కమిటీ మెంబర్‌ చామల శ్రీనివాస్‌, ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్‌రావు, కంపెనీ ప్రతినిధులు మన్మోహన, సత్య పాల్గొన్నారు.

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వీరేశం

ఎన్నికల హామీల అమలులో భాగంగా ఎమ్మెల్యే వీరేశం మెగాజాబ్‌ మేళా నిర్వహించి, మాట నిలబెట్టుకున్నారని ఎనఎ్‌సయూఐ రాష్ట్ర నాయకుడు కొమ్మనబోయిన సైదులుయాదవ్‌ అన్నారు. నకిరేకల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాబ్‌మేళాతో ఉద్యోగాలు కల్పించడం మంచి పరిణామమన్నారు. సమావేశంలో ఎనఎ్‌సయూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి అంజనకుమార్‌, ఏర్పుల గణేష్‌, శంకర్‌, ఆనంద్‌, మధుసూదనరెడ్డి, అనుముల శ్రీకాంత, నవీనరెడ్డి, నరేష్‌, సింహాద్రి, చంద్రశేఖర్‌, బాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:16 AM