Share News

కాంగ్రెస్‌ పార్టీకి చెంప చెళ్లుమనిపించాలి

ABN , Publish Date - May 20 , 2024 | 11:43 PM

హామీలు ఇచ్చి అమలుచేయని కాంగ్రెస్‌ పార్టీకి చెంప చెళ్ళుమనిపించేలా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెంప చెళ్లుమనిపించాలి

బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

కోదాడ/హుజూర్‌నగర్‌, మే 20: హామీలు ఇచ్చి అమలుచేయని కాంగ్రెస్‌ పార్టీకి చెంప చెళ్ళుమనిపించేలా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగవద్దని, అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను కొనుగోలుచేసి గెలిచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. మోదీ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అన్ని కుంభకోణాలే అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనకు నక్కకు, నాకలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కాం గ్రెస్‌ పాలనలో జమ్ము కశ్మీర్‌ తమను పాకిస్థాన్‌లో కలపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తే, బీజేపీ పాలనలో పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది పౌరులు తమను భారత్‌లో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నా రు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 12సీట్లు గెలుస్తుందని అమిత్‌షా మాట్లాడారని, అదే నిజం కాబోతోందన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మాటలు కోటలు దాటాయే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. అకాల వర్షాలకకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు అన్నిరకాల ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదన్నారు. దేవుళ్లపై ప్రమాణం చేసే స్థాయికి రేవంత్‌రెడ్డి దిగజారి పోయారన్నారు. సమావేశంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ.పాటిల్‌, బీజేపీ నల్లగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, నా యకులు బొబ్బ భాగ్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కనగాల నారాయణ, భాగ్యరెడ్డి, కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్‌, సాతులూరి హనుమంతురావు, అంజియాదవ్‌, కవితారెడ్డి, యశ్వంత్‌, వంగవీటి శ్రీనివాసరావు, వరుణ్‌రెడ్డి, చల్లా శ్రీలతా రెడ్డి, అంబళ్ళ నరేష్‌, గుండెబోయిన వీరబాబు, బాల వెంకటేశ్వర్లు, రామరాజు, రవి, విజయ్‌, పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:43 PM